Home » కీటో డైట్‌: కొవ్వుతో కొవ్వుపైనే ఫైట్‌

కీటో డైట్‌: కొవ్వుతో కొవ్వుపైనే ఫైట్‌

by hellomudra
0 comments

ఊబకాయమే అన్నిటికీ కారణం. డయాబెటిస్‌ (Diabetes), హైపర్‌ టెన్షన్‌ (Hypertension), హార్ట్‌ సంబంధిత వ్యాధులు (Heart Diseases), కిడ్నీ సమస్యలు (Kidney Problems).. ఒకటేమిటి.? క్యాన్సర్‌కి (Cancers) సైతం అధిక బరువు కారణమని (Keto diet weight loss) వైద్యులు చెబుతున్నారు.

బరువు తగ్గాలంటే (Obesity), కొవ్వు పదార్థాలకు (Keto diet weight loss) దూరంగా వుండాలి. కానీ, ఆ కొవ్వుని (fat) ఎక్కువగా తీసుకోవడం ద్వారా అధిక బరువుకి చెక్‌ పెట్టగలమని చెబితే నమ్ముతామా.? నమ్మి తీరాల్సిందే.

‘కీటోజెనిక్‌ డైట్‌’ (Ketogenic diet) పేరుతో వందేళ్ళ నుంచీ ఓ ఆహార విధానం అందుబాటులో వుంది. ఈ డైట్‌పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. నష్టం చాలా తక్కువగా, లాభాలు చాలా ఎక్కువగా వున్న డైట్‌గా దీనికి మంచి పేరుంది.

అయితే, మారిన జీవన శైలి కారణంగా కీటో డైట్‌ని (Keto Diet) అందరూ మర్చిపోయారు. అయితే అది ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రాచుర్యంలోకి వస్తోంది.

కీటో.. కేరాఫ్‌ తెలుగు గడ్డ (Keto diet weight loss)

మన తెలుగునాట ఈ కీటో డైట్‌కి (Keto Diet) విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చి పడింది. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ కీటో డైట్‌ గురించిన చర్చే జరుగుతోంది. ప్రధానంగా మహిళలు ఈ కీటో డౌట్ పట్ల ఆకర్షితులవుతున్నారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్లో కీటో డైట్ గురించి జరుగుతున్న చర్చ కారణంగా, సాధారణ సమాజంలో కీటో పట్ల అవగాహన పెరుగుతూ వస్తోంది.

సినీ, రాజకీయ ప్రముఖులు కీటో డైట్‌ పాటించి, అనూహ్యంగా బరువు తగ్గడం, అలా బరువు తగ్గినవారు తమ సన్నిహితులకు ఈ బరువు తగ్గే విధానం గురించి వివరిస్తుండడంతో మరికొందరు, ఈ కీటో డైట్‌ వైపు ఆకర్షితులవడం జరుగుతోంది.

కొందరు వైద్యులు కూడా కీటో డైట్‌ పాటిస్తున్నారంటే, దీనికి ఇప్పుడెంత ప్రాధాన్యత ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. తాము పాటించడమే కాకుండా, పేషెంట్లకు కూడా కొందరు వైద్యులు కీటో డైట్‌ గురించి వివరిస్తున్నారు.

అసలేంటి ఈ కీటో! Keto diet weight loss

కీటో డైట్‌ అంటే, ఆహారంలో తగినంత కొవ్వుని తీసుకోవడం. దీంట్లో కొబ్బరి నూనెని వంట నూనెగా వినియోగిస్తుండటమే కాదు, దాన్ని మామూలుగానూ సేవించడం ఓ ముఖ్యమైన అంశం.

కొబ్బరి నూనె (Coconut oil) కాకపోతే ఆలివ్‌ నూనె (Olive Oil) ఉపయోగపడ్తుందని కీటో డైట్‌ని ప్రచారంలోకి తెచ్చినవారు అంటున్నారు. నిజానికి కొబ్బరి నూనెతో పోల్చితే ఆలివ్‌ నూనె వల్ల ప్రయోజనాలు ఎక్కువ. కానీ, ఆలివ్‌ నూనె అతి ఖరీదైనది.

కేరళలో (Kerala) వంట నూనెగానూ కొబ్బరి నూనెను వాడతారన్న విషయం అందరికీ తెల్సిందే. కానీ, అలా చేసే ఆహార పదార్థాల్ని కేరళీయులు తప్ప, ఇతరులు తినేందుకు ఇష్టపడరు.

కానీ, అధిక బరువుతోపాటు (Obesity), అనేక అనారోగ్యాలకు చెక్‌పెట్టడానికి ‘కొబ్బరి నూనె’ (Coconut Oil)ను తీసుకోవడానికి ఎవరూ వెనుకాడ్డంలేదు.

కొబ్బరి నూనె, నిమ్మరసం, ఎగ్‌.. కొన్ని విటమిన్లు

కొబ్బరి నూనె మాత్రమే కాదు, కాస్తంత నిమ్మరసం (Lemon Juice) కూడా ఈ డైట్‌లో ముఖ్యమైనది.

ఎగ్‌ (Egg) తీసుకోవడం, అవసరమైన మేర విటమిన్లు ట్యాబ్లెట్ల (Vitamin Tablets) రూపంలో తీసుకుంటే, అసలు అనారోగ్య సమస్యలేవీ దరిచేరకుండా శరీర బరువుని అమాంతం తగ్గించేసుకోవచ్చన్నది కీటో డైట్‌కి రూపకల్పన చేస్తున్నవారు చెబుతున్నారు.

ఈ కీటో డైట్స్‌లో తెలుగునాట వీఆర్‌కే డైట్‌ (Keto diet weight loss) అనేది బాగా పాపులర్‌ అయ్యింది. రామకృష్ణ అనే వ్యక్తి, తాను తన కుటుంబ సభ్యులపై ఈ ఆరోగ్య విధానాన్ని ప్రయోగించి, అక్కడ సత్ఫలితాలు రావడంతో అందరికీ తెలియజేస్తున్నానని అంటున్నారు.

డాక్టర్లను సైతం ఈ డైట్‌పై (Keto Diet) సవాల్‌ విసురుతున్నారాయన.

కీటో డైట్‌ని సర్వరోగ నివారిణి అనగలమా?

అధిక బరువే (Obesity) అన్ని సమస్యలకూ కారణం గనుక, ఆ బరువుని తగ్గించుకోగలిగితే అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా వున్నట్లే. ఇది దాదాపుగా ప్రతి వైద్యుడూ చెప్పే మాటే.

శరీర బరువు అదుపులో వుంటే కిడ్నీలు పాడయ్యే పరిస్థితి వుండదనీ, డయాబెటిస్‌ పేషెంట్లు మందులు వేసుకోవాల్సిన అవసరం లేదనీ, హైపర్‌ టెన్షన్‌ పేషెంట్లకు ఆ సమస్యే వుండదనీ, గుండె జబ్బులతోపాటు (Heart Diseases), క్యాన్సర్‌కి సైతం దూరంగా వుండొచ్చనీ వైద్యలు చెబుతున్నారు.

మరోపక్మక్క, మహిళల్ని వేధించే పీసీవోడీ (PCOD) సమస్యలు, థైరాయిడ్‌ (Thyroid) సమస్యలకు కీటో (Keto Diet)చక్కని పరిష్కారమనీ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, వైద్యులు మాత్రం, ఈ కీటో డైట్‌ పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

వైద్య సలహా అతి ముఖ్యమైనది

కీటో డైట్‌ గురించి ఎంత సానుకూలత సమాజంలో వున్నాసరే, అది శాస్త్రీయమైనది కాదన్నది మెజార్టీ అభిప్రాయం. వైద్యులు ఇదే మాట చెబుతున్నారు.

ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా వుంటుందనీ, కొవ్వులు అధికంగా తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు రావొచ్చుననీ, ప్రధానంగా కిడ్నీ సమస్యలకు ఈ కీటో డైట్‌ కారణమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వైద్య నిపుణుల పర్యవేక్షణలో, కీటో డైట్‌ అయినా, మరో డైట్‌ అయినా చిన్న చిన్న మార్పులు చేసుకుని.. పాటించగలిగితే మంచి ఫలితాలు రావొచ్చునన్నది వారి వాదన.

ఆరోగ్యమే మహాభాగ్యం.. (Health is wealth) సరైన ఆహార విధానంతో ఆరోగ్యంగా జీవించొచ్చు. చికిత్స కంటే నివారణ (Prevention is better than cure) మేలు గనుక, ఆహారం – జీవన విధానం వంటి విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group