Khabarovsk Submarine Poseidon.. వివిధ దేశాల వద్ద వున్న న్యూక్లియర్ బాంబులతో, భూమ్మీద జీవజాలాన్ని సమూలనంగా నాశనం చేయొచ్చు.!
ఈ నేపథ్యంలోనే, తమ వద్ద వున్న అణు వార్‌హెడ్లను ధ్వంసం చేయాలని, అణ్వస్త్ర దేశాలు.. అందునా, ‘అమెరికా – రష్యా’ మధ్య కొన్నేళ్ళ క్రితం ఓ ఒప్పందం జరిగింది.
పూర్తిగా అణ్వస్త్ర రహిత దేశంగా మారిపోవాలని, ఏ అణస్త్ర దేశమూ అనుకోదు. కాకపోతే, అణ్వాయుధాల సంఖ్య తగ్గించుకునే క్రమంలో పై ఆలోచన చేసిన మాట వాస్తవం.
కానీ, ఆధిపత్య పోరు.. ఇతరత్రా కారణాలతో, ప్రపంచ వ్యాప్తంగా సరికొత్తగా అణ్వస్త్ర దేశాలు పుట్టుకొస్తున్నాయి.
అణ్వాయుధాల తయారీ, వాటిని మోసుకెళ్ళగల క్షిపణులు, యుద్ధ విమానాలు, జలాంతర్గాముల తయారీ.. కొత్త పుంతలు తొక్కుతోంది.
Khabarovsk Submarine Poseidon.. అండర్ వాటర్ డ్రోన్.. ఆ డ్రోన్లను కలిగి వున్న సబ్‌మెరైన్.!
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, అణ్వాయుధాల పోటీలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన రష్యా, గత కొద్ది కాలంగా, తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.
‘ప్రపంచానికే పెద్దన్న’ అనే ట్యాగ్ తగిలించుకున్న అమెరికా బెదిరింపుల కారణంగా, రష్యా తన బలమెంతో అమెరికాకి చూపించే ప్రయత్నం చేస్తోందన్నది నిర్వివాదాంశం.
ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న నింగిలో నిరంతరాయంగా పయనించే, న్యూక్లియర్ పవర్డ్ న్యూక్లియర్ మిస్సైల్‌ని రష్యా ప్రయోగించిన సంగతి తెలిసిందే.

యావత్ ప్రపంచం, ఈ క్షిపణి పరీక్షతో అవాక్కయ్యింది.. అమెరికా అయితే, తీవ్ర ఆందోళన చెందింది. ఇంతలోనే, రష్యా నుంచి మరో సంచలనం.
అత్యాధునిక జలాంతర్గాముల తయారీలో ఎప్పుడూ రష్యాదే పై చేయి. అలాంటి రష్యా నుంచి మరో అత్యాధునిక జలాంతర్గామి, లాంఛ్ అయ్యింది.
పేరేమో, ఖబరోవ్‌స్క్. అణు శక్తితో పనిచేసే జలాంతర్గామి ఇది. ఈ జలాంతర్గామి మరో ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఏకంగా ఆరు పొసీడన్ అండర్ వాటర్ డ్రోన్స్ వుంటాయి.
పొసీడన్ అండర్ వాటర్ డ్రోన్స్.. అంటే, ఇవి కూడా సబ్‌మెరైన్లు లాంటివేనని అనుకోవచ్చు. పొసీడన్ ప్రొపల్షన్ కూడా, అణు శక్తితోనే పనిచేస్తుంది. అదే దీని ప్రత్యేకత.
Also Read: యుద్ధ విమానంలో ద్రౌపది ముర్ము! రాష్ట్రపతితో రాఫెల్ శివాంగి!
అణుశక్తితో నడిచే పొసీడన్ అండర్ వాటర్ డ్రోన్ పరిధి అనంతం.! అది సృష్టించే విధ్వంసం కూడా అంతకు మించి.! సునామీని సముద్రంలో సృష్టించగల సత్తా వుంది పొసీడన్‌కి.
నగరాలకి నగరాల్ని ధ్వంసం చేసెయ్యగల శక్తి పొసీడన్‌కి వుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రష్యా అమ్ములపొదిలో పొసీడన్ ఎప్పుడో చేరిపోయింది.
పొసీడన్‌ని ప్రయోగించేందుకు కొన్ని అణు జలాంతర్గాములూ రష్యా వద్ద వున్నాయి. అయితే, తాజాగా రష్యా తయారు చేసిన ఖబరోవ్‌స్క్.. అంతకు మించిన శక్తివంతమైనది, చురుకైనది.

ఒక్కమాటలో చెప్పాలంటే, పొసీడన్ కలిగిన ఖబరోవ్‌స్క్ జలాంతర్గామి.. గేమ్ ఛేంజర్.! ఆధిపత్య పోరులో భాగంగా అమెరికా, ఇకపై రష్యా వైపు కన్నెత్తి చూసే పరిస్థితే లేదేమో.!
అయితే, ఈ తరహా ఆయుధాలు మానవాళి వినాశనం కోసమేనన్న వాదనలు లేకపోలేదు.! ఈ క్రమంలో రష్యా, అమెరికా మద్దతుదారులైన దేశాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావొచ్చు.
కానీ, తన రక్షణ కోసం రష్యా తనకంటూ ఓ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా.? అదే, రష్యా చేస్తున్నది.!
