Khushi Kapoor Nadaaniyan.. ‘అతిలోక సుందరి..’ అంటే ఠక్కున గుర్తొచ్చేది దివంగత నటి శ్రీదేవి. ఆమె తర్వాత ఆ సార్ధక నామధేయాన్ని శ్రీదేవి ముద్దుల తనయ అయిన జాన్వీ కపూర్ అందిపుచ్చుకుంది.
జాన్వీ కపూర్ గురించి తెలిసిందే. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. నటిగా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడిప్పుడే అదే.. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక, ప్రస్తుతం అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, మనం మాట్లాడుకోబోయేది జాన్వీ కపూర్ గురించి అస్సలు కాదు.
Khushi Kapoor Nadaaniyan.. శ్రీదేవి మరో తనయ కుషీ కపూర్‌ని మర్చిపోయారా.?
అందమే తనముందు జలస్ ఫీలయ్యేంత అందం శ్రీదేవిది. అందుకే శ్రీదేవి ఎవ్వర్ గ్రీన్ అందరికీ. ఆమెకు ఇద్దరు ముద్దుల తనయలు.
ఒకరు జాన్వీ కపూర్ కాగా, మరో ముద్దుగుమ్మ కుషీ కపూర్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలూ అందంలో తల్నలిని మించిపోయారా.? లేదా.? అనే సంగతి అటుంచితే, నటనలో మాత్రం తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నవాళ్లే అనడం అతిశయోక్తి కాదు.
ఆల్రెడీ జాన్వీ కపూర్ ప్రూవ్ చేసుకుంది. కానీ, తల్లిని మించిన తనయ అనిపించుకోలేకపోయింది. సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

కానీ, కుషీ కపూర్ అలా కాదనిపిస్తోంది. కుషీ కపూర్ నటించిన రీసెంట్ మూవీ ‘నదానియన్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైనా అందుబాటులోకి వచ్చింది. ధియేటర్లలో ఈ సినిమా ఏ స్థాయిలో ఆడిందనేది పక్కన పెడితే, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్సే అందుకుంటోంది.
తొలిసారిగా స్క్రీన్‌పై కుషీ కపూర్‌ని చూసిన వాళ్లు శ్రీదేవి కుమారై కదా.. ఆమె అందం అస్సలు రాలేదేంటీ.? అనుకుంటారు కానీ, చూడగా చూడగా ఈ సినిమాలో కుషీ కపూర్ యాక్టింగ్ టాలెంట్ అయితే బయట పడింది.
ఆ టాలెంట్ ముందు, అందం నో మ్యాటర్ అయిపోయింది. అక్క జాన్వీతో పోల్చితే, కుషీ కపూర్‌లో ఏదో మ్యాజిక్ వుందనిపించక మానదు.
బాగా షైన్ అయ్యే లక్షణాలున్నాయ్ కుషీ కపూర్‌లో అని ‘నదానియన్’ చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్‌లోనూ కుషీ కపూర్‌కి మంచి ఆదరణ దక్కే ఛాన్స్ లేకపోలేదు. అయితే, కెరీర్ స్టార్ట్ అయ్యాకా ఇన్నాళ్లకి టాలీవుడ్‌లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.
అక్క బాటలోనే చెల్లెలూ నడుస్తుందా.? లేక.!
అక్క లెక్కల్లోనే చెల్లెలు కూడా ముందుకెళితే, టాలీవుడ్‌లో కుషీని చూడాలంటే ఇంకెంత కాలం పడుతుందో ఏమో కానీ, టాలీవుడ్‌లో కుషీకి మంచి భవిష్యత్తుందనిపిస్తోంది.
మంచి కమర్షియల్ హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించే కళ కుషీ కపూర్‌లో కనిపిస్తుందనేది కొందరి అభిప్రాయం.
ఒకటీ, అరా వెబ్ సిరీస్‌లలో నటించిన అనుభవం, దాంతో పాటూ డెబ్యూ మూవీ.. ఇది చూస్తేనే ఇంత అనిపిస్తే.. ఇక ముందు ముందు మంచి స్కోపున్న పాత్రల్లో కుషీ కనిపిస్తే.. ఇంకెలా వుంటుందో కదా.!
ఇంతకీ, తెలుగులోకి ఖుషీ కపూర్ తెరంగేట్రమెప్పుడు.?