Kiara Advani Mango.. మహేష్ బాబు హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ కైరా అద్వానీ. తొలి సినిమాకే స్పెషల్ కిక్ ఇచ్చింది తన గ్లామర్ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కవ్వించింది.
వస్తూనే బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులతో మెస్మరైజ్ చేసింది. కానీ, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ రూపంలో ద్వితీయ విఘ్నం వెంటాడింది కైరా అద్వానీని.
దాంతో టాలీవుడ్‌కి కొన్నాళ్ళపాటు తాత్కాలికంగా గుడ్ బై చెప్పేసింది కైరా. టాలీవుడ్ ఫెయిల్యూర్స్‌ని బాలీవుడ్లో సక్సెస్‌గా మార్చుకుంది. బాలీవుడ్లో కైరా అద్వానీకి సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్, ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌ల రూపంలో కైరా అద్వానీకి సరికొత్త క్రేజ్ దక్కింది. దాంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు అందుకుంది.
‘కొత్త పెళ్లికూతురు’ ట్యాగ్‌తో..
చాలా తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది. బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ గురించి ఆలోచనే చేయలేదింతవరకూ కైరా అద్వానీ.

కానీ, ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Global Star Ram Charan RC15) నటిస్తున్న సినిమాతో మళ్లీ టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది.
ఇదీ ప్యాన్ ఇండియా మూవీ. సో, కైరా అద్వానీ (Kiara Advani) క్రేజ్ ఈ సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనడం అతిశయోక్తి కాదు.
అలాగే, రీసెంట్గా కోరుకున్న ప్రియుడు సిద్దార్ధ్ మల్హోత్రాని వివాహం చేసుకుని మరింత క్రేజీగా వార్తల్లో నిలుస్తోంది కైరా అద్వానీ. ‘కొత్త పెళ్లి కూతురు’ అనే ట్యాగ్‌తో కుర్రోళ్లలో కాక రేపుతోంది.
Kiara Advani Mango.. ఆరెంజ్ లుక్స్‌లో కైరా గ్లామర్ ‘మజా’.!
అసలే గ్లామర్.. ఆ పై స్టార్డమ్.. అన్నీ వెరసి.. పెళ్లి తర్వాత కూడా కైరా అద్వానీ ఎంత మాత్రమూ తగ్గడం లేదు. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.
Also Read: Ashika Ranganath: ఎందరో భామలు వస్తుంటారు గానీ.!
అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా గ్లామ్ షూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది కైరా అద్వానీ. తాజాగా కూల్ డ్రింక్ మాజా కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది కైరా అద్వానీ (Kiara Advani).

అందుకోసం ఆరెంజ్ కలర్ అందాలతో హాట్ సమ్మర్‌ని కూల్ కూల్‌గా మార్చేసింది కైరా అద్వానీ. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయ్.