April Fool Jagan Chandrababu.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పడూ చిత్ర విచిత్రమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి.!
దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ లేనంత గందరగోళమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటుండడం గమనార్హం.
ఏప్రిల్ 1వ తేదీ అంటే, ‘ఆల్ ఫూల్స్ డే’.! ఈ నేపథ్యంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ‘ఫూల్స్’ పోటీ జరిగింది. నువ్వా.? నేనా.? టైటిల్ విజేత ఎవరు.? అన్నట్టుగా పోటీ పడ్డాయ్ తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
ఔను, జనం నవ్వుకుంటున్నారు.. ఛీదరించుకుంటున్నారు.!
కానీ, వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీకి ఏమీ అర్థం కావడంలేదు.!
ఎవరు పెద్ద ఫూల్.? అన్న విషయమై టీడీపీ, వైసీపీ పోటీ పెట్టుకున్నాయ్.!
ఒక్కరు కాదు, ఇద్దరూ ఫూల్స్.. అంటూ రెండు పార్టీలపైనా దుమ్మత్తిపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం.!
Mudra369
ఒకటేమో అధికారంలో వున్న పార్టీ. ఇంకోటేమో, అంతకు ముందు అధికారంలో వున్న పార్టీ. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ‘ఫూల్స్’ వార్, జనాన్ని విస్మయానికి గురిచేసింది.
చంద్రబాబు ఫొటోతో ‘ఆల్ ఫూల్స్ డే’ని గుర్తు చేసింది వైసీపీ (YSR Congress Party). దానికి ప్రతిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో ‘ఫూల్’ ఇతనే.. అంటూ టీడీపీ (Telugu Desam Party) కౌంటర్ ఎటాక్‌కి దిగింది.
April Fool Jagan Chandrababu.. ఫూల్స్.. ఆ ఇద్దరూ.!
మీలో మీరు ఎందుకు కొట్టుకుంటారు.? ఒప్పేసుకుంటున్నాం.. రెండూ పార్టీలకూ ‘ఆల్ ఫూల్స్ డే’ శుభాకాంక్షలు. ‘ఏప్రిల్ ఫూల్ 2023’ పురస్కారం మీ ఇద్దరూ పంచుకోండి.. అంటూ జనం తేల్చేశారు.

ఇప్పుడర్థమయ్యింది కదా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఎలా వుందో.! ప్రజలేమనుకుంటున్నారన్నది ప్రధాన రాజకీయ పార్టీలకు అనవసరం.
Also Read: Andhra Pradesh April Fool
బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్నది చిన్న మాట, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి.!
రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు (Polavaram Project), రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone), రాజధాని (Andhra Pradesh Capital).. ఈ అంశాలపై ఎవరికీ చిత్తశుద్ధి వున్నట్లు కనిపించడంలేదు.
ఎందుకు కనిపిస్తుంది.? ఎవరు పెద్ద ఫూల్.? అన్న విషయమై రెండు పార్టీలూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ ఫూల్ ‘టైటిల్’ కోసం తలపడుతున్నాయి కదా.!