Kidney Donation Old Woman.. ఇరవయ్యేళ్ళకే కిడ్నీ సమస్య ఆ యువకుడ్ని మృత్యువు వైపుగా నడిపించింది. కానీ, కాటికి కాలు చాపుకున్న ఓ వృద్ధురాలు తన కిడ్నీ దానం చేసి, ఆ యువకుడి ప్రాణాల్ని కాపాడింది.!
వైద్య రంగంలో ఇలాంటి అద్భుతాల్ని తరచూ చూస్తుంటాం. అవయవదానం చేయడమంటే, ఇంకోసారి జీవించడం.!
కళ్ళు, కిడ్నీలు, ఊపిరితిత్తులు.. ఇలా ముఖ్యమైన అవయవాలు రెండేసి వున్నప్పుడు, అవయవదానం వల్ల.. దాతలకు ప్రాణాపాయం వుండదు. పైగా, ఓ ప్రాణాల్ని కాపాడినవారవుతారు.
లివర్ విషయంలో అయితే, కొంత భాగాన్ని దానం చేసేందుకు అవకాశం వుంటుంది.
అసలు విషయంలోకి వస్తే..
కర్నాకటలోని బెలగావి సమీపంలోని హరుగేరికి చెందిన ఓ యువకుడు చిన్నప్పటినుంచీ మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నాడు.
ప్రాణం అత్యంత విలువైనది. బతికుండగానే ఇంకొకర్ని బతికించే అవకాశమొస్తే.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. అదే దైవత్వం.! ఔను, ఆ బామ్మ ఆ మనవడి పాలిట దైవం.!
Mudra369
చాలాకాలంగా మందులతో నెట్టుకొచ్చారు. అయితే, బాధితుడు సచిన్‌కి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తూ వచ్చారు.
కొడుకుని బతికించుకునేందుకు కిడ్నీ దానం చేస్తామని తల్లిదండ్రులు ముందుకొచ్చినా, వారికి వున్న అనారోగ్య సమస్యల వల్ల వైద్యులు అది సరైన నిర్ణయం కాదని వారికి సూచించారు.
అయితే, ఆరోగ్యంగానే వున్న బామ్మ, తన మనవడికి ఓ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వైద్యులు ఆమెకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి.. కిడ్నీ దానం వల్ల ఆమెకేమీ సమస్యలు వుండవని తేల్చారు.
Kidney Donation Old Woman.. సూపర్ బామ్మ..
డాక్టర్ రవీంద్ర ముద్రాకి నేతృత్వంలో వైద్యులు బెలగావిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సచిన్‌కి శస్త్ర చికిత్స నిర్వహించారు.
శస్త్ర చికిత్స విజయవంతమవడంతో సచిన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 73 ఏళ్ళ వయసులోనూ కిడ్నీ దానం చేసిన బామ్మ కూడా ఆరోగ్యంగానే వుంది.
Also Read: యుద్ధ విమానంపై హనుమాన్.! ఎందుకీ కాంట్రవర్సీ.!
ఇలా చాలా అరుదైన విషయమనీ, ఏడు పదుల వయసులో కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చిన బామ్మ అభినందనీయురాలనీ, ఆమె ‘సూపర్ బామ్మ’ అని వైద్యులు పేర్కొన్నారు.
రక్త దానం పెద్దగా శ్రమతో కూడుకున్నది కాదు. ఎంతోమంది సరైన సమయంలో రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు చేసే రక్త దానం ఓ ప్రాణాన్ని నిలబెడుతుంది. ఓ కుటుంబాన్ని ఆదుకుంటుంది.
Mudra369
తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే, తన బామ్మ తనకు పునర్జన్మినిచ్చిందని శస్త్ర చికిత్స విజయవంతమయ్యాక కోలుకుంటున్న సచిన్ తన బామ్మ గురించి గర్వంగా చెబుతున్నాడట.
ప్రాణం అత్యంత విలువైనది. బతికుండగానే ఇంకొకర్ని బతికించే అవకాశమొస్తే.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. అదే దైవత్వం.! ఔను, ఆ బామ్మ ఆ మనవడి పాలిట దైవం.!