Valentines Day Publicity Love ఆడెవడో ప్రేమికుల రోజు.. అన్నాడు.! అంతే, ఈడేమో గర్ల్ ఫ్రెండ్‌ని వెతుక్కుంటూ పోయాడు.!
అబ్బాయిలే కాదు, అమ్మాయిలదీ ఇదే తంతు.! ఎక్కడ చూసినా, జంటలు జంటలుగా అమ్మాయిలు, అబ్బాయిలు.. కలిసి పండగ చేసేసుకున్నారు.!
ఖరీదైన బహుమతులు.. పార్కుల్లో ఏకాంత క్షణాలు.. వామ్మో, ఇది ప్రేమ కాదు.. పైత్యం.! కామం.! ఇంకోటేదో పేరు పెట్టాలి దీనికి.!
Valentines Day Publicity Love.. ప్రేమంటే అది కాదు.. ఇదీ.!
అసలు ప్రేమంటే ఏంటి.? తల్లి తన బిడ్డల మీద చూపించేది ప్రేమ కాదా.? తండ్రి తన బిడ్డల మీద చూపించేది ప్రేమ కాదా.?
అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ.. అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ.! ఏదైనా ప్రేమే.! కాకపోతే, బాయ్ ఫ్రెండ్ – గర్ల్ ఫ్రెండ్ మధ్య వుండేది, వ్యామోహంతో కూడిన ప్రేమ.! అంతే తేడా.!

వెలకట్టలేని ప్రేమ కుటుంబ సభ్యులది.! ఆ కుటుంబ సభ్యుల్ని నిండా ముంచేసే ప్రేమని.. అసలు ప్రేమ అనగలమా.?
అయినా, ఆకాశమంత ప్రేమకి ఒక్క రోజు సరిపోతుందా.?ముందే చెప్పుకున్నాం కదా.. ఆడెవడో ప్రేమికుల రోజు అన్నాడని.. ఈళ్ళంతా పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారంతే.!
ఒక్కరోజుకే ప్రేమని పరిమితం చేయగలమా.?
ఓ అబ్బాయి, ఓ అమ్మాయిని ప్రేమించడమే నిజమైతే.. ఆ ప్రేమ ఒక్కరోజుకే పరిమితమవుతుందా.? నిజమైన ప్రేమికులకి ప్రతిరోజూ ప్రేమికుల రోజులానే వుంటుంది.!
పార్కుల్లో పొదల మాటున పుట్టేది ప్రేమ కాదు, కామం.! ఖాళీ థియేటర్లో కార్నర్ సీట్‌లో ప్రదర్శించేది ప్రేమ కాదు, పైత్యం.!

నిజమైన ప్రేమికులందరికీ ప్రతిరోజూ ప్రేమికుల రోజేనని చెప్పుకున్నాం కదా.. ఆ లెక్కన ఈ రోజూ, రేపూ.. ఎప్పుడూ ప్రేమికుల రోజే.!
ప్రేమ గురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవు.! ప్రేమ గురించి మాట్లాడుకుంటూ పోతే, రోజులు.. నెలలు.. సంవత్సరాలు కూడా సరిపోవు.!
Also Read: Jyothi Rai ‘గుప్పెడంత మనసు’! ఈ Pretty Girl ఎవరంటే.!
ఇప్పుడు ప్రేమికుల రోజు పేరుతో నడుస్తున్నది అసలు ప్రేమే కాదు.! ఇదొక వ్యామోహం.! పైత్యం.! కామం.! ఇదొక పైశాచికత్వం.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.!
స్నేహితులదీ ప్రేమే.. తల్లిదండ్రులదీ ప్రేమే.! ప్రేమ అంటే, ప్రేమ అంతే.!