Kidney Health Drinking Water.. కిడ్నీలు పాడవ్వకూడదంటే, చాలా ఎక్కువ నీళ్ళు తాగేయాలా.! ఈ విషయమై గూగుల్ తల్లిని అడిగితే, చాలా సమాచారం ఇచ్చేస్తుంటుంది.!
కొత్తగా ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయ్ కదా.. ఆ ఏఐ టూల్స్ ఇచ్చే సమాధానాలు మళ్ళీ కోకొల్లలు. ఇంతకీ, కిడ్నీలకీ, నీళ్ళకీ లింకేంటి.? వైద్యులు ఏం చెబుతున్నారు.?
అతి సర్వత్ర వర్జయేత్.. ఇది పెద్దలు చెప్పే మాట.! దేంట్లో అయినా ‘అతి’ అస్సలు పనికి రాదు.! నీళ్ళు బాగా తాగండి.. అని వైద్యులు చెబుతారు.
బాగా తాగండి.. అని, నీళ్ళు తక్కువ తాగేవారికి వైద్యులు చెప్పడం చూస్తుంటాం. శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడం కిడ్నీల పని.!
తగినంత నీరు శరీరానికి అవసరం. కిడ్నీల ద్వారా మలినాలు ఫిల్టర్ అయి, మిగిలిన నీరు, మూత్ర నాళాల ద్వారా బయటకు వస్తుంది.
Kidney Health Drinking Water.. తగినంత మంచి నీరు మాత్రమే..
మరి, శరీరానికి తగినంత నీరు అందకపోతే.? నీళ్ళు తగినంతగా తాగకపోతే.? ప్రధాన అవయవాల పని తీరు మందగిస్తుంది. మలినాల్ని శుభ్రం చేసే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.
అందుకే, శరీరానికి అవసరమైనన్ని నీళ్ళు తాగాలి. ఎక్కువ నీళ్ళు తాగేసి, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, అది మళ్ళీ అదనపు సమస్యల్ని తెచ్చిపెడుతుంది.
కిడ్నీ స్టోన్స్.. అనగానే, ఎక్కువ నీళ్ళు తాగేస్తే కరిగిపోతాయ్.. అనే వాదన ఒకటుంది. దాని గురించి ఇంకో సందర్భంలో చర్చించుకుందాం.
అవసరమైనన్ని నీళ్ళు తాగితే, కిడ్నీ స్టోన్స్ తయారవడం తగ్గుతుంది. అదీ అసలు సంగతి.
అర్థమయ్యింది కదా.. అతి సర్వత్ర వర్జయేత్.! కిడ్నీల ఆరోగ్యం తాగే మంచి నీళ్ళ మీద కూడా ఆధారపడి వుంటుంది.
దాంతోపాటుగా, డయాబెటిస్.. హైపర్ టెన్షన్.. ఇవి కూడా కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అరకొర సమాచారంతో, శరీరానికి హాని కలిగించే చర్యలకు ఉపక్రమించొద్దు.
అనుమానాలు ఏమైనా వుంటే, వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యుల సలహా మేరకే, ఎక్కువ నీళ్ళు తాగాలా.? తక్కువ నీళ్ళు తాగాలా.? అన్నది చేయాల్సి వుంటుంది.
ముఖ్య గమనిక.. వాట్సాప్ యూనివర్సిటీలు ఇచ్చే బోడి సలహాలు.. మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వైద్యులు మాత్రమే, మీ ఆరోగ్యానికి సరైన, శాస్త్రీయమైన సలహాలు ఇవ్వగలుగుతారు.
