Kiran Abbavaram KRamp Boothulu.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి ‘కె-ర్యాంప్’ అనే సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
‘కె-ర్యాంప్’ సినిమా ప్రమోషన్లు కూడా చాలా గట్టిగానే నడుస్తున్నాయి కూడా.
కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు నరేష్ ఈ ‘కె-ర్యాంప్’లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ప్రోమోస్‌లో బూతులెక్కువయ్యాయన్న విమర్శ వుంది. ఇదే విషయమై, తాజాగా మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ, సీనియర్ నటుడు నరేష్.. ఏదో వింత వాదన తెరపైకి తెచ్చారు.
‘ఔను, మీరు ఎక్కువయ్యాయని అన్నారు కదా.. అందుకే, ట్రైలర్‌లో బూతులు తగ్గించాం..’ అంటూ సెటైరేశారు నరేష్.
Kiran Abbavaram K-Ramp Boothulu.. సందర్భోచితమైన బూతులనగానేమి.?
మరోపక్క, హీరో కిరణ్ అబ్బవరం, సందర్భోచితమైన బూతులు.. అంటూ, తమ సినిమాలోని బూతుల్ని సమర్థించుకున్నాడు. ఇదో చిత్రం.!
అన్నట్టు, ఈ ‘కె-ర్యాంప్’ టైటిల్ విషయంలోనే, ‘పెద్ద బూతు’ అన్న విమర్శ వుందాయె. కానీ, అది బూతు కాదనీ, సినిమా చూస్తే అర్థమవుతుందనీ.. అంటున్నాడు కిరణ్ అబ్బవరం.
ఇంతకీ, సందర్భోచితమైన బూతు అంటే ఏంటి.? హీరో ఫ్రస్ట్రేషన్‌కి గురైనప్పుడల్లా బూతులు వస్తాయనీ, తెరపై అవి అసభ్యకరంగా వుండవనీ హీరో కీరణ్ చెప్పుకొచ్చాడు.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
బూతు అంటే, అది బూతే.! అది, బూతులా వుండదని చెబితే ఎలా.? ఫ్రస్ట్రేషన్ అయినా, సరదా అయినా.. బూతు బూతే కదా.!
యూత్‌ఫుల్ సినిమా అంటే, బూతులుండాలనే ‘పారామీటర్’ పెట్టేసుకున్నారేమో సినీ జనాలు. చిన్న పిల్లలతో కూడా బూతులు మాట్లాడించేస్తున్న సినిమాలు చూస్తున్నాం.
సో, కిరణ్ అబ్బవరం బూతులు తప్పేమీ కాదన్నమాట.! పైగా, సందర్భోచితమైన బూతులు.. అని కూడా అంటున్నాడు కిరణ్. ఆ బూతుల సంగతేంటో, సినిమా రిలీజైతే తెలిసిపోతుంది.
సినిమా తప్పక విజయం సాధించిందనీ, తన మాట నమ్మి సినిమాకి ధైర్యంగా రావాలని అభిమానులకు కిరణ్ అబ్బవరం పిలుపునిస్తున్నాడు.
