ముచ్చటగా మూడోది.! జాన్వీ కపూర్ ఖాతాలో ఇంకోటి.!

 ముచ్చటగా మూడోది.! జాన్వీ కపూర్ ఖాతాలో ఇంకోటి.!

Janhvi Kapoor

Janhvi Kapoor Tollywood Nani.. తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ విషయమై కాస్త తటపటాయించిందిగానీ, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది జాన్వీ కపూర్.!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) సరసన ‘దేవర’ (Devara) సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Siva) ఈ చిత్రానికి దర్శకుడు.

‘దేవర’ రెండు పార్టుల్లో విడుదల కానుంది. మొదటి పార్ట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది.

Janhvi Kapoor Tollywood Nani.. మెగా ఛాన్స్..

ఇంకోపక్క, రామ్ చరణ్ (Global Star Ram Charan) సరసన బుచ్చిబాబు సన (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే.

అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇటీవలే ‘గేమ్ చేంజర్’ సినిమాలో తన పార్ట్ షూటింగ్‌ని కంప్లీట్ చేసుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan).

Janhvi Kapoor
Janhvi Kapoor

నిజానికి, చాలాకాలం క్రితమే జాన్వీ కపూర్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కాల్సి వుంది. ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ సినిమాకి సీక్వెల్ చేయాలని అప్పట్లో అనుకున్నారు. కానీ, అది కుదరలేదు.

నేచురల్ స్టార్ నాని సరసన..

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నేచురల్ స్టార్ నాని సరసన ఓ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించడం ఖాయమైనట్లు తెలుస్తోంది.

Also Read: Premalu Review: అసలు ప్రేమ ఎక్కడుంది.?

ప్రస్తుతం నాని (Natural Star Nani) హీరోగా తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodha Sanivaram) సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

నాని – జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కొరత వుంది.. జాన్వీ (Janhvi Kapoor) గనుక, ఇదే జోరు కొనసాగిస్తే.. ఆ కొరత కూడా తీరిపోద్దేమో.!

Digiqole Ad

Related post