Kondal Telugu Review.. కథలో విషయం వుంటే, స్థానిక కథ అయినా, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటుంది.! అయినా కథ, కాకరకాయ్.. ఇప్పుడెవరికి కావాలి.?
ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమానే.! కాదు కాదు, పాన్ వరల్డ్ సినిమా.! ఏం పెనమో.. ఏం సినిమానో.! చాలా సినిమాలు మాడి మసైపోతున్నాయ్.
అసలు సినిమా అంటేనే చాలామందికి విరక్తి పుడుతోంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్.. అన్న మాటని కూడా చాలామంది ప్రేక్షకులు ఇష్టపడని పరిస్థితి.
పెద్ద పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలు, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టర్ అందుబాటులోకి వచ్చేశాక.. థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడాలని ఎవరు మాత్రం అనుకుంటారు.?
కారణాలేవైనాగానీ, ఓటీటీకి ప్రేక్షకులు బాగా అలవాటుపడిపోయారు. సెలక్టివ్‌గా సినిమాలు చూసేందుకు, సినిమా నచ్చకపోతే స్కిప్ చేసేందుకు.. అవకాశం వుందిక్కడ మరి.!
అసలు విషయానికొస్తే, ఓ సినిమా గురించి ఇప్పుడంతటా చర్చ జరుగుతోంది. అదే ‘కొండల్’. మలయాళ సినిమా. ఓటీటీ ద్వారా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో వుంది.
Kondal Telugu Review.. కొండల్ కథా కమామిషు ఏంటి.?
అలా ఓటీటీ యాప్స్ అన్నీ తిరగేస్తోంటే, ‘కొండల్’ కనిపించింది. సర్లే, టైమ్ పాస్ కోసమని మొదలు పెడితే, సినిమా పూర్తయ్యేవరకూ రిమోట్ టచ్ చేయాలనిపించలేదు.
కొత్త కథ ఏమీ కాదు. నేపథ్యమూ కొత్త కాదు.! కాకపోతే, గ్రిప్పింగ్‌గా సినిమాని దర్శకుడు తెరకెక్కించాడు. అందుకే, ‘కొండల్’ అంతలా ఆకట్టుకుంది.
ప్రధానంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. టీవీ స్క్రీన్ నుంచి చూపుని పక్కకు తిప్పుకోనివ్వలేదు.. చెవుల్ని ఇంకో శబ్దం విననివ్వలేదు.
సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా సహజంగా కనిపిస్తుంది. ప్రతి మాటా ఆకట్టుకుంటుంది. ఇదొక రివెంజ్ డ్రామా.! నటీనటులెవరు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెరపై పాత్రల స్వబావం మాత్రమే కనిపిస్తుంది.
హై ఓల్టేజ్ యాక్షన్..
హై ఓల్టేజ్ యాక్షన్.. అనదగ్గర రీతిలో యాక్షన్ ఎపిసోడ్స్‌ని డిజైన్ చేశారు. సినిమాలో చాలా భాగం నడి సంద్రంలోని బోటు మీదనే.!
చివర్లో వీఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేసిన షార్క్, హాలీవుడ్ సినిమాల్లోని షార్క్‌ని తలపిస్తుంది. నటీనటులెవరూ మన తెలుగు ప్రేక్షకులకి తెలిసినవాళ్ళు కాదు. అయినాగానీ, ఆయా పాత్రలతో కనెక్ట్ అవుతాం.
టైమ్ చూసుకుని అయినా, ఓ సారి ‘కొండల్’ సినిమాని చూసి తీరాల్సిందేననిపిస్తుంది. పదిమందికి రికమెండ్ చేయాలని కూడా అనిపిస్తుంది.
Also Read: ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాల్లో.!
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళేవారెలా వుంటారు.? వారి జీవన శైలి ఏంటి.? ఇవన్నీ దర్శకుడు చక్కగా చూపించాడు. ఓవరాల్‌గా కొండల్ ఓ మంచి సినిమా.!
బాటమ్ లైన్.. పాన్ ఇండియా సినిమాల గురించి తరచూ మాట్లాడేసుకుంటుంటాం కదా.! ఆ రేంజ్ సినిమా ఇది.!