Konidela Akira Nandan.. పెద్ద చిక్కే వచ్చి పడింది.! అకిరా నందన్ (Akira Nandan) ఎవరి కొడుకు.? అన్న చర్చ షురూ అయ్యింది.! అసలెందుకీ రచ్చ.?
‘మా అన్న కొడుకుని చూసుకోవాలని మాకూ వుంటుంది కదా.?’ అని ఓ అభిమాని, సినీ నటి రేణు దేశాయ్‌ని (Renu Desai) సోషల్ మీడియా వేదికగా ‘రిక్వెస్ట్’ చేశాడు.!
అంతే, రేణు దేశాయ్‌కి కోపం వచ్చింది.! ‘మీ అన్న కొడుకేంటి.? వాడు నా కొడుకు.!’ అంటూ రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
Konidela Akira Nandan రేణుదేశాయ్‌కి అది తెలియదా.?
సినీ నటిగా, అభిమానులెలా వుంటారో రేణు దేశాయ్‌కి తెలియదని ఎలా అనుకోగలం.? పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కొన్నాళ్ళు సహజీవనం చేశారు. ఆ తర్వాత వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
అకిరా నందన్ ఎవరి కొడుకు.?
పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ అంటే తప్పేంటి.?
అకిరా నందన్‌కి రేణు దేశాయ్ తల్లి కాదనగలిగేదెవరు.?
అయినా, అభిమానుల్లో పైత్యం, అత్యుత్సాహం గురించి రేణు దేశాయ్‌కి తెలియదని ఎలా అనుకోగలం.?
తల్లి ప్రేమను తక్కువ చేసి మాట్లాడటం తప్పే.!
‘మా అన్న కొడుకు అకిరా నందన్’ అని అభిమానులు భావిస్తే, దాన్ని రేణు దేశాయ్ తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం.?
ఈ మొత్తం వ్యవహారంలో, పవన్ కళ్యాణ్ వ్యతిరేకుల శునకానందం ఎందుకు హైలైట్ అవుతోంది.?
Mudra369
పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) – రేణు దేశాయ్‌ల (Renu Desai) వైవాహిక బంధానికి గురుతులు అకిరా నందన్ (Akira Nandan), ఆద్య (Aadhya).
‘అచ్చం నాన్న లాగానే..’ అంటూ అకిరానందన్ విషయంలోనూ, ఆద్య విషయంతోనూ తరచూ చెబుతుండేవారు రేణు దేశాయ్. ఇప్పటికీ చెబుతుంటారు కూడా.

అభిమానుల్లో కొందరుంటారు.. వారికి కొంత అత్యుత్సాహమెక్కవ. కొందరైతే అభిమానం ముసుగేసుకుని, జుగుప్సాకరమైన వ్యవహారాలూ తెరపైకి తెస్తారు.
సోకాల్డ్ నెగెటివిటీని ఆపడం కష్టం.! ఆ విషయం రేణు దేశాయ్‌కి కూడా తెలుసు. ‘కనీసం అకిరానందన్ పుట్టినరోజునాడైనా నన్ను వేధించడం ఆపండి’ అంటూ రేణు దేశాయ్ విజ్ఞప్తి చేయడాన్ని తప్పు పట్టలేం.
స్పందించడం దండగ..
కానీ, రేణు దేశాయ్, ఇలాంటి వాటికి స్పందించడమే దండగ.! అది తిరిగి, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద నెగెటివిటీకి కారణమవుతుంది మరి.!
పవన్ కళ్యాణ్ ఏనాడూ రేణు దేశాయ్ మీద కామెంట్స్ చేయరు. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నాక పలు సందర్భాల్లో ఆయన మీద నెగెటివ్ కామెంట్స్ చేశారు
.
అయినా, పవన్ లైట్ తీసుకున్నారు. అభిమానులు ఏదో అంటే, దాని మీద తీవ్రంగా రెస్పాండ్ అయి.. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు రేణు దేశాయ్ ఎందుకు అవకాశమిస్తున్నట్టు.?
Also Read: గేమ్ ఛేంజర్ కాదు, దిల్ రాజు ఫిట్టింగ్ మాస్టర్.!
కొడుకు లేదా కూతురు.. తల్లిదండ్రులిద్దరికీ సమానమే.! సమానమైన హక్కులు, బాధ్యతలు వారి మీద వుంటాయ్.! పిల్లలకీ తల్లి దండ్రుల మీద సమానమైన హక్కులు, బాధ్యతలు వుంటాయ్ మరి.!
అభిమానుల్ని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టలేరు, కంట్రోల్ చేయలేరు.! చేయగలిగితే, ఆ అభిమానుల ఓట్లన్నిటినీ తన పార్టీకి వేయించుకునేవారు.!
ఆ అభిమానుల మీద పూర్తి అదుపు ఆయనకు వుంటే, అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్నయినా ఎందుకు ఫ్లాప్ అవుతాయ్.?
‘నా సినిమాలు నచ్చితేనే అభిమానులైనా చూస్తారు. నచ్చకపోతే చూడరు. నచ్చకపోయినా అభిమానులు సినిమాలు చూసేస్తే, ఎందుకు ఫ్లాపులొస్తాయ్.?’ అని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు ఓ సందర్భంలో.