Kotamreddy Sridhar Reddy.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చిన్న మాట తూలితే చాలు.. వ్యవహారం సీఐడీ వరకూ వెళ్ళిపోతోంది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితేంటో అంతా చూశాం. అలాంటిది, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా తిరుగుబాటు బావుటా వేశారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన.?
వైసీపీ వర్గాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో.. ఆ మాటకొస్తే, తెలుగు రాష్ట్రల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
Kotamreddy Sridhar Reddy.. నెల్లూరు నాయకుడు..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడేమీ కాదు. నెల్లూరు జిల్లాలో.. అందునా ఓ నియోజకవర్గానికి మాత్రమే ఆయన ఇమేజ్ పరిమితం.
రాజకీయ నాయకులు పార్టీలు మారితే.. అది తప్పెలా అవుతుంది.? రాజకీయమంటేనే కప్పల తక్కెడ కదా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది. కాంగ్రెస్ ఎంపీగా వున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన విమర్శలు చేయలేదా.?
Mudra369
కానీ, రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. కారణం, ఆయన సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడం.
రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. జనసేన పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. వైసీపీలో చేరిపోలా.?
జనసేన మీద రాపాక విమర్శలు చేస్తే, టీడీపీ మీద వల్లభనేని వంశీ తదితరులు విరుచుకుపడ్డారు. అలాగే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీని తూలనాడుతున్నారు.
ధైర్యవంతుడే..
అధికార పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేయాలంటే చాలా ధైర్యమే వుండాలి. పైగా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడమంటే చిన్న విషయం కాదు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద రకరకాల కేసులు నమోదవుతాయంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో వింతేముంది.? రాజకీయ నాయకులకు కేసులు కొత్తేమీ కాదు.
Also Read: అభిప్రాయమ్.! ‘సెంబి’.. ఓ ‘సాధారణ’ సినిమా.!
రఘురామకృష్ణరాజులా, కోటంరెడ్డి కూడా సీఐడీ ట్రీట్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుందా.? అన్న చర్చ కూడా జరుగుతోంది. ‘అన్నిటికీ సిద్ధమే’ అంటున్నారాయన.
వైనాట్ 175.. అంటోన్న వైసీపీ, ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఉలిక్కిపడాల్సిన అవసరమైతే లేదు. కానీ, ఉలిక్కిపడుతోంది. కారణమేంటబ్బా.?