Krithi Shetty Mega Love.. నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడేళ్ల పాటు తమ ప్రేమని నిప్పు లేని పొగలా దాచిపెట్టేసిందీ ప్రేమ జంట.
వన్ ఫైన్ డే ‘ఔను మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం..’ అంటూ పెళ్లికి లైన్ క్లియర్ చేసేసుకున్నారు. నిశ్చితార్ధంతో ఒక్కటై అందరికీ షాకిచ్చారు.
ఎవరి గురించి చెప్పుకుంటున్నామో మీకీ పాటికి ఓ ఐడియా వచ్చే వుంటుంది. అవునండీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.
లేలేత ప్రేమ ‘అప్పుడే’ చిగురించిందా..!
‘మిస్టర్’ సినిమా టైమ్‌లో పుట్టిన ప్రేమ.. ఇటీవలే నిశ్చితార్ధంతో బయటికొచ్చింది. ఇదిలా వుంటే, తాజాగా ఇంకో మెగా లవ్ తెరపైకి వచ్చింది.
‘ఉప్పెన’ సినిమాతో డెబ్యూ చేసిన వైష్ణవ్ తేజ్ పంజా, కృతి శెట్టి జంట కూడా రియల్ లవ్‌ని ఎంజాయ్ చేస్తున్నారన్నదే ఆ గాసిప్ సారాంశం.
ఏమో.! వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌కి అభిమానులు ఈ వార్తని కూడా కొట్టి పడేయాలా.? వద్దా.? అనే డైలమాలో వున్నారట.

అవును మరి, నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఎన్ని సార్లు చెప్పుకున్నా ఇంతే.! ‘ఉప్పెన’ సినిమాలో క్యూట్ పెయిర్‌గా కనిపించారు ఈ జంట.
ఈ సినిమాతోనే పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా తెగ బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది.
Krithi Shetty Mega Love.. కొట్టి పారేయలేం సుమీ.!
బ్యాడ్ లక్.! బేబమ్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బోల్తా కొట్టడంతో.. ఐరెన్ లెగ్ ముద్ర వేసుకుని సైడ్ అయిపోయింది.
మరోవైపు వైష్ణవ్ తేజ్ ఆచి తూచి కథలను ఎంచుకుంటూ పక్కా ప్లానింగ్‌తో కెరీర్ బిల్డప్ చేసుకుంటున్నాడు. వైష్ణవ్ తాజా సినిమా ‘ఆది కేశవ్’ త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
బేబమ్మ చేతిలో అయితే ప్రస్తుతం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేదు. ఈ టైమ్‌లో వైష్ణవ్ తేజ్‌తో కృతి శెట్టి పీకల్లోతు ప్రేమలో వుందంటూ గాసిప్ గుప్పు గుప్పుమంటూ చక్కర్లు కొట్టేస్తోంది.
Also Read: పూజా హెగ్దే కళ్ళల్లో శ్రీలీల, సంయుక్త.. ‘గుంటూరు కారం’.!
తూచ్.! ఇదంతా గాలి వార్తే అని కొట్టి పడేయాలా.! లేక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాదిరి షాకింగ్ న్యూస్.. బ్రేకింగ్ న్యూస్.. అని హోల్డ్ చేసి పెట్టాలా.! ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.!