Krithi Shetty Triple Dhamaka.. ‘బేబమ్మా’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని క్యూట్‌గా పలకరించిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. నిజానికి తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ అన్ని అర్హతలూ కృతి శెట్టిలో వున్నాయ్.
తొలి సినిమా ‘ఉప్పెన’ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో అంతా అదే అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే కృతి శెట్టికి అవకాశాలూ పోటెత్తాయ్.
ఒక టైమ్ అంతా కృతి శెట్టిదే. సినిమా ఏదైనా కానీ, హీరో ఎవరైనా కానీ.. (స్టార్ హీరోలు మినహాయింపు) హీరోయిన్ మాత్రం కృతి శెట్టినే అన్నట్లుగా వరుసగా కృతి శెట్టి నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూ వచ్చాయ్.
Krithi Shetty Triple Dhamaka.. అక్కడ బేబమ్మదే హవా.!
కానీ ఏం లాభం.! అన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ లిస్టులో క్యూ కట్టేశాయ్. దాంతో.. ఐరెన్ లెగ్ ముద్ర వేయించేసుకుందీ అందాల హీరోయిన్.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాంతో కొన్నాళ్లు ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది. లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్లీ వచ్చింది ‘మనమే’ సినిమాతో. ఈ సినిమాతోనైనా బౌన్స్ బ్యాక్ అవుతుందనుకుంటే, అదీ కుదరలేదు.

వాస్తవానికి ‘మనమే’ సినిమా ధియేటర్లలో జనాన్ని అలరించలేకపోయినా.. ఓటీటీ జనం నుంచి పాజిటివ్ నోటే తెచ్చుకుంది. కానీ, అది కృతి శెట్టి కెరీర్‌కి ఏమాత్రం యూజ్ కాలేదు.
ఇక, ప్రస్తుతం తెలుగులో ప్రాజెక్టులేమీ లేవు కానీ, తమిళంలో బిజీగా వుంది కృతి శెట్టి. మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటిస్తోందక్కడ.
జీనీ గాళ్..
అందులో ఒకటి కార్తితో ‘వా వాతియార్’ సినిమా కాగా, ఇంకోటి ‘లవ్ ఇన్సూరెన్స్’. ఈ సినిమాలో ‘డ్యూడ్’ ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటిస్తున్నాడు.
మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘జీనీ’. జయం రవి హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో కళ్యాణి ప్రియదర్శిని అలాగే వామికా గబ్బి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అన్నట్లు ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘అబ్డీ అబ్డీ’ సాంగ్‌లోని కృతి శెట్టి అరబిక్ డ్యాన్స్ సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే.
సో, తెలుగులో సినిమాల్లేకపోతేనేం.! తమిళంలో వరుస సినిమాలతో అవి కూడా దేనికవే ప్రత్యేకమైన ప్రాజెక్టులతో బిజీగా వున్న కృతి శెట్టికి టైం కలిసొచ్చి ఈ సినిమాలు హిట్టయ్యాయంటే తెలుగులోనూ మళ్లీ కృతి హవా స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
