Table of Contents
Kriti Sanon Adipurush Controversy .. సీత మహా సాద్వి.! ఆమెను అత్యంత హేయంగా రాముడి పాత్రధారి బంధించి తీసుకెళ్ళడమేంటి.?
సినిమాల్లో హాట్ అండ్ వైల్డ్‌గా కనిపించే కృతి సనన్ (Kriti Sanon), ‘సీత’ పాత్రలో నటించడం అత్యంత హేయం.!
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, ఆ తిరుమల కొండ మీదనే, దర్శకుడు ఓం రౌత్‌తో నిస్సిగ్గుగా బహిరంగంగా ముద్దు పెట్టించుకోవడమా.?
Kriti Sanon Adipurush Controversy.. ఎందుకీ రచ్చ.? ఎవరిది పాపం.?
నిజమే, సీత పాత్ర విషయమై కృతి సనన్ ఒకింత పద్ధతిగా వ్యవహరించి వుండాలి.! ఎందుకంటే, ఇది వివాదాల కాలం.!
చిన్న విషయానికే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న రోజులివి. సింపుల్‌గా సినిమాని బ్యాన్ చేసెయ్యాలన్న డిమాండ్లు వచ్చేస్తుంటాయ్.
సినిమాల్లో గ్లామరస్ పాత్రలు వేయడం కృతి సనన్ తప్పు కాదు.! సినిమా అంటేనే గ్లామర్.! సో, ఈ విషయంలో ఆమెను తప్పు పట్టడానికేమీ లేదు.
రావణుడు.. సీతని అలా ఎత్తుకెళ్ళాడా.?
‘ఆదిపురుష్’ సినిమాలో రావణుడు, సీతను ఎత్తుకెళ్ళిన వైనం వివాదాస్పదమవుతోంది. మామూలుగా అయితే, భూమిని పెకిలించి సీతా దేవిని తీసుకెళ్తాడు రావణుడు.

సీతను అస్సలు టచ్ చేయడు.. ఆమెను అస్సలు హింసించడు. రావణుడంటే రాక్షసుడు మాత్రమే కాదు, రావణ బ్రహ్మ అతడు.!
నిజానికి, ఇక్కడ తప్పంతా దర్శకుడిదే. గ్రాఫిక్స్ పైత్యం చూపించే క్రమంలో, సీతని అలా తాళ్ళతో బంధించి రావణుడు తీసుకెళుతున్నట్లుగా చూపించాడు.
ఈ తప్పు మాత్రం కృతి సనన్దే.!
ప్రముఖులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళితే, ఆలయ మర్యాదలతో స్వాగతించడం మామూలే.
ఈ క్రమంలోనే కృతి సనన్‌కి కూడా శేష వస్త్రంతో సత్కరించి, దీవించారు పండితులు. ఆ శేష వస్త్రం వుండగానే, దర్శకుడు ఓం రౌత్‌ని కౌగలించుకుంది కృతి సనన్.
Also Read: Kalyani Priyadarshan.. సొగసుల ఖిల్లా.. ఈ నల్లా నల్లాని పిల్ల.!
దర్శకుడు ఓం రౌత్, ఇంకాస్త కక్కుర్తి పడి, అందరూ చూస్తుండగానే ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఇక్కడ దర్శకుడి తప్పు సుస్పష్టం. ఆ అవకాశం అతనికిచ్చిన కృతి సనన్ కూడా తప్పు చేసేసింది.
ఈ ఎపెక్ట్ సినిమా మీద ఎంత.? అంటే, వివాదమైతే రాజుకుంది.! ఏమో, అది సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడుతుందేమో.!