Kriti Sanon.. తొలి తెలుగు సినిమా పెద్దగా ఆడకపోయినా, రెండో సినిమా ఛాన్స్ దక్కిదామెకి. కానీ, ఆ రెండో సినిమా కూడా డిజాస్టర్ రిజల్ట్ ఇవ్వడంతో, ఇక ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు.
ఆమె ఎవరో కాదు కృతి సనన్. తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు.. హిందీలోనూ ఫ్లాపులే వెక్కిరించాయి. ఆపై, తోటి నటీమణులే ఆమె ‘ఫిజిక్’ గురించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు.
కానీ, ఎవరైతే ఆమెను చూసి వెటకారం చేశారో.. వాళ్ళే కుళ్ళకునేలా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టింది కృతి సనన్.
మహేష్.. నాగచైతన్య..
తొలి తెలుగుసినిమా ‘1 నేనొక్కడినే’. హీరో మహేష్‌బాబు.. దర్శకుడేమో సుకుమార్.! ప్చ్.. సినిమాలో ఆమె బాగానే చేసినా, సినిమా ఫెయిల్యూర్ దెబ్బకి ఆమె ఐరన్ లెగ్ అయిపోయింది.

ఆ తర్వాత నాగచైతన్య సినిమా ‘దోచెయ్’తోనూ తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచెయ్యలేక చతికిలపడింది కృతి సనన్.
బాలీవుడ్‌లో కొన్ని ఫ్లాపుల తర్వాత హిట్టు మీద హిట్టు కొడుతూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కృతి సనన్, ఫ్యాషన్ ట్రెండ్స్ పరంగా ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.
కోతల డ్రెస్సు..
జాకెట్టుకీ కిటికీలెట్టి.. అని ఓ తెలుగు సినిమాలో పాటొకటుంటుంది. కిటికీలు కాదు, ఏకంగా తలుపులే పెట్టేసింది కృతి సనన్ ఈ డ్రెస్సుకి.
Also Read: Waltair Veerayya.. ఓర్నీ.! నువ్వు కూడానా.?
నీ డ్రెస్సుకి పెట్టావ్ కోతలు.. మా గుండెకీ పడుతున్నాయ్ కోతలు.. అంటూ నెటిజన్లు కామెంట్లేస్తున్నారామె డ్రెస్ మీద.
నీలి రంగు సింగిల్ పీస్ కాస్ట్యూమ్‌లో వీర లెవల్ గ్లామర్ ప్రదర్శిస్తోంది పొడుగు కాళ్ళ సుందరి కృతి. అన్నట్టు, తెలుగులో మళ్ళీ ‘ఆదిపురుష్’ సినిమాతో కృతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.