Table of Contents
Kushi Movie Review.. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ చిత్రం, సమంత అనారోగ్య సమస్యల కారణంగా అయోమయంలో పడింది.!
అయితే, సమంత డెడికేషన్‌తోనే సినిమా పూర్తయ్యిందని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. విజయ్ దేవరకొండ కూడా సమంత డెడికేషన్‌కి ఫిదా అయ్యాడు.
‘యశోద’ సినిమా టైమ్‌లోనే తీవ్ర అనారోగ్యానికి గురైన సమంత, ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలోనూ కష్టంగానే కనిపించింది.
‘ఖుషి’ సినిమా ప్రమోషన్లలోనూ సమంత పెద్దగా కనిపించలేదు. విజయ్ దేవరకొండ ఒక్కడే సినిమా ప్రమోషన్లని భుజానికెత్తుకున్నాడు.
తన సినిమాలకు సహజంగా చేసుకునే పబ్లిసిటీకి భిన్నంగా ‘ఖుషి’ సినిమాకి విజయ్ దేవరకొండ పబ్లిసిటీ చేసుకున్నాడు.
మ్యూజికల్ షో పేరుతో విజయ్ దేవరకొండ – సమంత ఇచ్చిన లైవ్ పెర్ఫామెన్స్ అప్పట్లో హాట్ టాపిక్. ‘ఖుషి’ సినిమాపై అంచనాలు పెరగడానికి ఇదీ ఓ కారణం.
Kushi movie Review.. ‘ఖుషి’ సినిమా ఎలా వుంది.? కథా కమామిషు ఏంటి.?
ఉద్యోగ రీత్యా కాశ్మీర్‌కి వెళతాడు విప్లవ్. అక్కడ అతనికి ‘ఆరా’ పరిచయమవుతుంది.. ముస్లిం యువతిగా.! కానీ, ఆరా అసలు పేరు ఆరాధ్య అనీ, సంప్రదాయ బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందిన యువతి అని విప్లవ్‌కి తెలుస్తుంది.
ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుందిగానీ, ఆరాధ్య తండ్రి వీరి పెళ్ళికి అంగీకరించడు. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు.. ఆ తర్వాత వీరి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలొచ్చాయన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ, సమంత.. నటనా ప్రతిభ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ..
సంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
నిడివి
విజయ్ దేవరకొండ సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది.? బెస్ట్ ఇచ్చిందని అనలేంగానీ, అవసరమైనంత మేర మంచి పెర్ఫామెన్స్‌తోనే ఆకట్టుకుంది.
సమంత – విజయ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ పెయిర్ మీద ఎలాంటి కంప్లయింట్స్ కనిపించవ్. అంత సహజంగా నటించారు ఇద్దరూ.
మిగతా పాత్రధారుల్లో మురళీ శర్మ తదితరులు, తమ తమ పాత్రలకు తగిన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు.
టెక్నికల్లీ బ్యూటిఫుల్.. కానీ..
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే, ముందుగా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. కాశ్మీర్ అందాల్ని అత్యద్భుతంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్.

ప్రతి ఫ్రేమ్ చాలా చాలా రిచ్‌గా వుంది. ఆ విజువల్స్‌కే ప్రేక్షకుడు స్పెల్ బౌండ్ అవుతాడనడం అతిశయోక్తి కాదేమో.
సినిమాటోగ్రఫీ తర్వాత, సంగీతానికి ఎక్కువ మార్కులేయాలి. పాటలు బావున్నాయ్.. తెరపై చూడ్డానికి అవింకా బావున్నాయ్. నేపథ్య సంగీతంతోనూ తన మార్కు వేయగలిగాడు సంగీత దర్శకుడు.
కొంచెం కోత పడి వుంటే..
డైలాగ్స్ విషయానికొస్తే, ఇంకా పొటెన్షియాలిటీ వున్న డైలాగులు రాసి వుండాల్సింది. రెగ్యులర్ కథే అయినా, కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఎడిటింగ్ పరంగా చూస్తే, ‘కోత’ బాగానే విధించి వుండాల్సింది.
అక్కడక్కడా స్లో అనిపించినా, అంతలోనే పుంజుకుంటుంది సినిమా. ఆ ‘సాగతీత’ అన్న భావన లేకుండా మేకర్స్, సినిమా నిడివిని తగ్గించగలిగి వుంటే బావుండేదేమో.!
Also Read: ‘సలార్’ కోసం శృతిహాసన్.! అంత స్పెషల్‌గా ఏం చేసిందంటే.!
నిడివి సినిమాకి పెద్ద మైనస్.! దాన్ని భరించగలిగితే, సినిమా గుడ్.. బెటర్.. అన్న భావన కలుగుతుంది.

టార్గెట్ ఆడియన్స్ యూత్.. అలాగే, ఫ్యామిలీకి నచ్చేలానే దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. ‘క్రిస్పీ’గా లేదన్న ఒక్క కారణం తప్పితే, సినిమాని ప్రేక్షకులు ఆదరించేందుకే అవకాశాలెక్కువన్నమాట.
‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండకీ, ‘శాకుంతలం’ తర్వాత సమంతకీ.. ఈ ‘ఖుషి’ సినిమాతో హిట్టు దొరికినట్టేనా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.! కానీ, అదంతా ప్రేక్షకులు సినిమాని రిజీవ్ చేసుకునేదాన్ని బట్టి వుంటుంది.!