Home » Pushpa The Rise Review: అల్లు అర్జున్ అదుర్స్.. కానీ.!

Pushpa The Rise Review: అల్లు అర్జున్ అదుర్స్.. కానీ.!

by hellomudra
0 comments
Pushpa The Rise Review

Pushpa The Rise Review.. ‘రంగస్థలం’ సినిమాతో ‘పుష్ప’ సినిమాకి పోలికెందుకు.? ఆ సినిమాకీ, ఈ సినిమాకీ దర్శకుడు ఒకరే గనుక. ‘రంగస్థలం’ (Rangasthalam) తరహాలోనే ‘పుష్ప’ తెరకెక్కుతోందనే సంకేతాల్ని మొదటి నుంచీ ఇస్తూ వచ్చారు గనుక. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ‘రా అండ్ కల్ట్ మూవీ’ అంటూ ‘పుష్ప’ గురించి ప్రచారం జరిగింది.

ఇంతకీ, ‘పుష్ప ది రైజ్’ ఎలా వుంది.? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ (Pushpa Raj Allu Arjun) ఏం చేశాడు.? శ్రీవల్లి పాత్రలో రష్మిక మండన్న (Srivalli Rashmika Mandanna), మంగళం శ్రీను పాత్రలో సునీల్, దాక్షాయణి పాత్రలో అనసూయ భరద్వాజ్, భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ ఎలా మెప్పించారు.? ఇవన్నీ తెలియాలంటే ‘పుష్ప’ సినిమా చూడాల్సిందే.

Pushpa The Rise Review.. కథా కమామిషు..

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే డబ్బు సంపాదించొచ్చనే భావనతో, కూలీగా మొదలైన పుష్పరాజ్ ప్రస్థానం.. రకరకాల మలుపులతో అనూహ్యంగా ఎదుగుతుంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళు, వాటిని పుష్పరాజ్ అధిగమించిన తీరు.. ఇదే ‘పుష్ప ది రైజ్’ సినిమా కథ. మొదటి పార్ట్ తర్వాత, రెండో పార్ట్ ఎలా వుండబోతోందో.. ముగింపులోనే దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.

Pushpa The Rise

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. పాత్ర కోసం అల్లు అర్జున్ (Icon StAAr Allu Arjun) పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్.. ఇలా దేంట్లోనూ అల్లు అర్జున్‌కి వంక పెట్టడానికి వీల్లేదు. రష్మిక మండన్న (Rashmika Mandanna) కూడా చాలా భిన్నమైన పాత్రలో కనిపించింది. ఒకరేమిటి.? సినిమాలో నటించిన వారిలో దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి.

అయితే, ఎవరి పాత్రకు ఎంత స్కోప్ లభించిందన్నదే కీలకం ఇక్కడ. సునీల్ (Sunil) ఆకట్టుకున్నాడు. అనసూయకు (Anasuya Bharadwaj) పెద్దగా సీన్ రాలేదు.. ఫహాద్ ఫాజిల్ (Fahaad Faazil) సామర్థ్యానికి తగ్గ పాత్ర కాదు, పుష్ప ‘ది రైజ్’ వరకూ. ఏమో, రెండో పార్ట్ (పుష్ప ది రూల్)లో ఫహాద్ ఫాజిల్ సత్తా చూపిస్తాడేమో.!

Pushpa The Rise Trailer Review
Pushpa The Rise

యాక్షన్ అదుర్స్.. పాటలు సూపర్బ్..

యాక్షన్ సీన్స్ అదిరిపోయాయ్. ‘పుష్ప’ (Pushpa Review) పాటలు సూపర్ హిట్టయ్యాయిగానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం, వుండాల్సిన స్థాయికి ‘తక్కువగానే’ వుందనిపిస్తుంది. ఎడిటింగ్‌కి చాలా పని చెప్పి వుండాల్సింది. కత్తెర పదును బాగా తక్కువ కావడంతో, సాగతీత.. అనే భావన కలుగుతుంది. అన్నట్టు, సమంత (Samantha Ruth Prabhu) చేసిన స్పెషల్ సాంగ్ కెవ్వు కేక.

Also Read: యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయుధాలివీ.!

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు సుకుమార్ (Director Sukumar) కొన్ని చోట్ల తనదైన స్పార్క్ చూపించినా, ‘రంగస్థలం’ మ్యాజిక్ అయితే రిపీట్ చేయలేకపోయాడన్నది నిర్వివాదాంశం. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ‘పుష్ప’ షూటింగ్ జరిగిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆ విషయంలో ‘పుష్ప’ బృందానికి స్పెషల్ ‘హేట్సాఫ్’ చెప్పి తీరాల్సిందే.

క్రియేట్ అయిన హైప్‌ని దృష్టిలో పెట్టుకోకుండా సినిమాకి వెళితే, ఆకట్టుకుంటుంది. హైప్‌ని దృష్టిలో పెట్టకుని సినిమా చూస్తే ఖచ్చితంగా ‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise Review) నిరాశపరుస్తుంది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group