Table of Contents
Kushi Shiva Nirvana Blunders.. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ నిర్వాణ దర్శకుడు.!
కాశ్మీర్ అందాల్ని సినిమాటోగ్రాఫర్ బాగానే క్యాప్చర్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వుంది.!
అయితే, ఈ సినిమాకి అసలు కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్ ఎందుకు.? ముస్లిం అమ్మాయిలా, సమంత పాత్ర ఎందుకు డ్రామా క్రియేట్ చేసినట్లు.?
Kushi Shiva Nirvana Blunders.. జస్ట్ నాన్సెన్స్.!
పాకిస్తానీ అమ్మాయి.. అంటూ సమంత గురించి, ఆమె స్నేహితురాలు చెబుతుంది విజయ్ దేవరకొండతో.! ఇంతకన్నా ఫన్నీ థింగ్ ఇంకేమన్నా వుంటుందా.?
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి.. తిండి కోసం, పహల్గామ్ అనే ఊళ్ళో అడుక్కోవడమేంటో, అన్ని ఇళ్ళల్లోంచీ యాపిల్స్ అతని చేతుల్లోకి వచ్చి పడటమేంటో.!
పైగా, ‘సోదరుడు తప్పిపోయాడు’ అన్న డ్రామా ఒకటి.! దాన్ని పట్టుకుని వెర్రి వెంగళప్పలా హీరో.. ఆ కాశ్మీర్‌లో తిరగడం ఇంకా దారుణం.!

అసలు కాశ్మీర్‌లోకి హీరో ఎంట్రీనే పెద్ద కామెడీ.! కాశ్మీర్ అందాల్ని చూడ్డానికి, రైలు ఇంజిన్‌లో, డ్రైవర్ పక్కనే కూర్చుంటాడట హీరో.!
చూపించలేదుగానీ, అలా చెప్పించాడు హీరోతో దర్శకుడు.! జనాల్ని వెర్రి వెంగళప్పల్ని చేయడం.. దాదాపు అన్ని ఫ్రేముల్లోనూ కనిపించింది.
యుద్ధమంటే అంత వెర్రితనమా.?
రోడ్డు మీద మంచు కొండల అందాలు చూస్తూ హీరోగారు వెళుతోంటే, ఇంతలో బాంబు వచ్చి పడుతుంది.. అంతే, ఇండియన్ ఆర్మీ.. తూటాలు పేల్చేస్తుంటుంది.. ఒక్కసారిగా రంగంలోకి దిగేసి.
అసలు దీన్ని యుద్ధమంటారా.? కాల్పులు.. యెదురు కాల్పులంటారు.! కానీ, పదే పదే యుద్ధం.. అంటూ ఓ పిచ్చి ప్రస్తావన తీసుకొచ్చాడు దర్శకుడు విజయ్ దేవరకొండ పాత్రతో చెప్పించడం ద్వారా.!
అదేంటో, ఒక్క బుల్లెట్ కూడా హీరో ప్రయాణిస్తున్న వాహనానికి తగలదు.! బీఎస్ఎన్ఎల్ ఉద్యోగికి, పాకిస్తాన్ నుంచి వచ్చిన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా.? ఇది ఇంకో పిచ్చి.!
బీఫ్ బిర్యానీ.. ఇది వేరే లెవల్.!
ఆ బీఫ్ బిర్యానీ ఎపిసోడ్.. ఆ మామళేశ్వర్ దేవాలయం ఎపిసోడ్.. వాట్ నాట్, అన్నీ జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికే దర్శకుడు తెరకెక్కించినట్టున్నాడు.
రాసుకుంటూ పోతే, అన్నీ ఆణిముత్యాలే.! ఓ పది పదిహేను.. ఆపైన ఆర్టికల్స్ రాసేసుకోవచ్చు. అంతలా, ప్రతి సీన్ తీసేటప్పుడూ.. ప్రేక్షకుడ్ని టార్చర్ పెట్టేయాలని బలంగా శివ నిర్వాణ అనుకున్నట్టున్నాడు మరి.!
Also Read: నా సామిరంగ.! ‘కింగ్’ నాగ్ అంటే ఇట్లుండాలె.!
పోనీ, కామెడీ కోసమే చేశాడా.? అంటే, కామెడీ కాదురా.. పిచ్చి అంటారు దీన్ని.. అని థియేటర్లలో ప్రేక్షకులే అనుకోవడం కనిపించింది.
అన్నట్టు.. మంచు కొండల్లో బహిరంగ మల విసర్జనం.. అక్కడ మళ్ళీ బాటిల్‌లోని నీళ్ళు గడ్డ కట్టడం.! ఇదో సీను.! కడుపుకి అన్నం తినేవాడెవడైనా దీన్ని కామెడీ అంటాడా.?