నా సామిరంగ.! ‘కింగ్’ నాగ్ అంటే ఇట్లుండాలె.!

 నా సామిరంగ.! ‘కింగ్’ నాగ్ అంటే ఇట్లుండాలె.!

Akkineni Nagarjuna Naa Saami Ranga

Naa Saami Ranga Nagarjuna.. అక్కినేని నాగార్జున ఎందుకని కెరీర్‌లో ‘స్లో’ అయినట్లు.? వయసు మీద పడుతున్నా, నాగార్జున హ్యాండ్సమ్‌ లుక్‌లో ఏమాత్రం తేడా రాలేదు, రాబోదు కూడా.!

ఫిట్‌నెస్ విషయంలో, ఆ నలుగురు అగ్రహీరోల్లో నాగార్జునకి పోటీ ఇంకెవరూ ఇవ్వలేరేమో.! ఇంతకీ, ఆ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి.? అనడిగితే, ‘సీక్రెట్ కదా.. చెప్పకూడదు..’ అని నవ్వేస్తారాయన.!

ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే, అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) తదుపరి సినిమా వివరాల్ని వెల్లడించారు.

Naa Saami Ranga Nagarjuna.. నా సామిరంగ.!

కొత్త సినిమా టైటిల్ ‘నా సామిరంగ’.! ఊర మాస్ లుక్కుతో అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఫస్ట్ లుక్‌‌తోనే ‘కింగ్ ఆఫ్ మాస్’ అనే విషయాన్ని స్పష్టం చేసేశారు మేకర్స్.! వచ్చే సంక్రాంతికే, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందిట.

Also Read: అల్లు అర్జున్ జాతీయ అవార్డుని కొనుక్కున్నాడా.?

ఫస్ట్ లుక్‌తోపాటు, ఓ చిన్న ప్రమోషనల్ వీడియో కూడా విడుదల చేశారు. అందులో నాగ్ డిక్షన్, స్టైలింగ్.. వేరే లెవల్ అంతే.!

విజయ్ బిన్ని దర్శకత్వంలో, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ ‘నా సామిరంగ’ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Digiqole Ad

Related post