Kushi Vijay Samantha Love Story.. ‘ఖుషి’ సినిమాకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.! పవన్ కళ్యాణ్, భూమిక జంటగా 2001లో ‘ఖుషి’ సినిమా వచ్చింది. ఎస్.జె. సూర్య దర్శకుడు.
‘ఖుషి’ సినిమాలో పవన్ (Power Star Pawan Kalyan) – భూమిక (Bhumika Chawla) మధ్య చిలిపి తగాదాలు, రొమాంటిక్ సీన్స్.. ఇవన్నీ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంతే.!
మళ్ళీ ఇన్నేళ్ళకు ఆ మ్యాజిక్ రిపీట్ అవబోతోందా.? అంటే, ఏమో.. ప్రస్తుతానికైతే అది సస్పెన్సే. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఖుషి’.
ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే, ఆనాటి ‘ఖుషి’ క్లాసిక్ ఫీల్ తీసుకొచ్చింది. హీరో హీరోయిన్లను చాలా యూనిక్‌గా ముడిపెట్టేశారు. అంతా బాగానే వుందిగానీ, పావురాలేంటి.? బ్యాక్‌డ్రాప్‌లో అణుబాంబు విస్ఫోటనం ఏంటి.?
Kushi Vijay Samantha Love Story ప్రేమ కథేనా.?
పైకి కనిపిస్తున్నంత కూల్‌గా సినిమా కనిపించేలా లేదు. అసలే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసేస్తున్నాడు. సమంత సంగతి సరే సరి.

‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత (Samantha Ruth Prabhu) ఉగ్ర రూపం చూసేశాం. ఆమె డైనమిక్ యాక్షన్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారంతే.
‘ఖుషి’ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ అమాయకుడిలా కనిపిస్తున్నాడు.. అంతకన్నా అమాయకంగా సమంత కూడా కనిపిస్తోంది. కానీ, ఈ అమాయకత్వం వెనుక ఎలాంటి అగ్ని పర్వతాలు వున్నాయో ఏమో.!
Also Read: నయనతారకి పెళ్ళి కాకుండానే విడాకులట.!
2023 డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. అన్నట్టు, విజయ్ – సమంత గతంలో ‘మహానటి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులో, ఈ ఇద్దరివీ స్పెషల్ రోల్స్.!