Kushi4k Vs Simhadri4k పాత సినిమాల్ని రీ-రిలీజ్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం.? పైగా, ఈ రీ-రిలీజ్ కోసం పెద్దయెత్తున ఖర్చు చేయడమొకటి.!
అభిమానులు తమ అభిమాన హీరోల పాత సినిమాల్ని చూడాలనుకోవడం తప్పు కాదు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా పాత సినిమాలకు కొత్త గ్లామర్ అద్దితే, ఆ కిక్క వేరప్పా.!
మొన్న ‘ఖుషీ’.. ఇప్పుడేమో ‘సింహాద్రి’.. మధ్యలో చాలా సినిమాలొచ్చాయ్. కానీ, ‘ఖుషీ’ సినిమాకి జరిగినంత హంగామా.. ఇటీవలి కాలంలో ఇంకే సినిమాకీ జరగలేదన్నది నిర్వివాదాంశం.
Kushi4k Vs Simhadri4k.. ఖుషీని ఢీకొడదామనే తాపత్రయంలో..
‘ఖుషీ’ని ఢీకొట్టాలన్న కక్కుర్తి కారణంగానే, ‘సింహాద్రి’ సినిమాకి లేనిపోని హైప్ తెచ్చిపెట్టారు. రికార్డులు కొట్టేశామంటున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.
బుద్ధుండాలి.. ఇక్కడ రికార్డుల గురించి మాట్లాడటానికి.! మొన్నీమధ్యనే ‘ఆరెంజ్’ సినిమా వచ్చింది. నిజానికి, అది ఫ్లాప్ సినిమా.
చిత్రంగా, ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అనిపించుకుంది. ఇదో చిత్రం. పాటలు బాగున్నాయనో.. ఇంకో కారణంతోనో, ‘ఆరెంజ్’, తనమీదున్న ఫ్లాప్ ముద్రని చెరిపేసుకుంది.
‘చెన్న కేశవరెడ్డి’ సినిమా విషయంలోనూ అదే పరిస్థితి. కానీ, ‘సింహాద్రి’ని ఇండస్ట్రీ రికార్డుగా పేర్కొంటుంటారు. దాన్ని రీ-రిలీజ్ చేసి.. అవమానపర్చడమెందుకు.?
అభిమానుల రచ్చ..
‘సింహాద్రి’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్‌ని తగలబెట్టేశారట అభిమానులు.. అత్యుత్సాహంతో. కొన్ని కుర్చీలు మాత్రమే కాలిపోయాయనీ, పెను ప్రమాదం తప్పిందనీ అంటున్నారు.
దేనికోసం ఈ యాగీ.? 5 కోట్ల పైన పబ్లిసిటీ కోసమే ఖర్చు చేశారన్న ప్రచారంలో నిజమెంత.?
అన్నట్టు, ‘సింహాద్రి’ మేనియాలో పడి, ఇతర హీరోల్ని నానా బూతులూ తిడుతున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు. అవసరమా ఇదంతా.?
Also Read: పరిణీతి చోప్రా పెళ్ళిగోల.! అప్పడైతే కష్టం, ఇప్పుడేమో ఇష్టం.!
రీ-రిలీజ్ సినిమాల కోసం ప్రత్యేకించి బాక్సాఫీస్ ట్రాకర్లు లేరు.. రెగ్యులర్ బాక్సాఫీస్ ట్రాకర్లు పట్టించుకోవడంలేదు.!
ఎలా చూసినా, ‘ఖుషీ’ని ‘సింహాద్రి’ టచ్ చేయలేకపోయిందన్నది, ఆయా థియేటర్ల వద్ద పరిస్థితిని బట్టి చెప్పొచ్చు.
అట్టహాసంగా, రికార్డు స్థాయిలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ‘సింహాద్రి’ని విడుదల చేసినా, ‘ఖుషీ’ని టచ్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.