Krithi Shetty Manamey.. ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న అందాల భామ కృతి శెట్టి.
ఒక సీజన్ మొత్తం సినిమా ఏదైనా, హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం కృతి శెట్టి మాత్రమే అనేంతలా ఆమె వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ, ఏం లాభం.!
బాక్సాఫీస్ వద్ద కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ రిజల్ట్‌నే దక్కించుకున్నాయ్. దాంతో, కృతి శెట్టి ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుని పక్కకి తప్పుకోవల్సి వచ్చింది.
Krithi Shetty Manamey.. సక్సెస్ ఫార్ములా బేబమ్మకి వర్కవుట్ అవుతుందా.?
అలా గ్యాప్ తీసుకున్న కృతి శెట్టి.. ఇప్పుడు మళ్లీ వస్తోంది ‘మనమే’ సినిమా ద్వారా. ఈ సారి ఓ చిన్న బాబుకి తల్లి పాత్రలో కృతి శెట్టి నటిస్తోంది.

శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య ధర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచీ సమ్‌థింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్స్ కొనసాగుతోంది.
అలా ఈ సారి కృతి శెట్టికి హిట్టు పక్కా అనిపించేలా వుంది. అంతేకాదు, ఈ సినిమాలో సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ కూడా వున్నాడు.
కల నెరవేరేనా.?
తండ్రి సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఆ సెంటిమెంట్ కూడా ప్రస్తుత ఫార్ములాలో సక్సెస్ అయ్యే సూచనలున్నాయ్.
సో, ఎలాగైతేనేం, ‘మనమే’ హిట్టు కొడితే, కృతి శెట్టి మళ్లీ కమ్ బ్యాక్ అయ్యే ఛాన్సుంది. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ బ్రైట్‌గా డిజైన్ చేశారు.
Also Read: పాయల్ రాజ్‌పుత్‌ని వెంటాడుతున్న పాత గాయం.!
మరి, సినిమా కూడా అంతే బ్రైట్‌గా వుంటే, బేబమ్మకి సక్సెస్ పక్కా. అందానికి అందం, అభినయానికి అభినయం.. బేబమ్మ మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయితే చూడాలని కోరుకుంటున్న అభిమానులెందరో.!
మరి, అభిమానుల కోరిక తీరేనా.! ‘మనమే’ సినిమా హిట్టయ్యేనా.! తెలియాలంటే, జూన్ 7 వరకూ ఆగాల్సిందే.