LEO Disaster Vijay లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ (LCU) కాస్తా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) అయిపోయిందా.?
విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లియో’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.. దాంతోపాటే, విపరీతమైన నెగెటివిటీనీ ఎదుర్కొంటోంది.
‘లియో’ సినిమా పెద్ద డిజాస్టర్.. అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రెండింగ్ చేస్తున్నారు. దానికి కౌంటర్ ఎటాక్ ఇవ్వలేక విజయ్ అభిమానులు నానా తంటాలూ పడాల్సి వస్తోంది.
LEO Disaster Vijay.. సోషల్ మీడియాలో విజయ్ అభిమానుల సందడేదీ.?
తమిళనాట సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా వుండే అభిమానుల్లో విజయ్, అజిత్ అభిమానులు వెరీ వెరీ స్పెషల్.
ఈ రెండు గ్రూపుల మధ్యా ఎప్పుడూ రచ్చ జరుగుతుంటుంది. అయితే, ఈసారి అజిత్ అభిమానులు లైట్ తీసుకున్నారు. కానీ, ‘లియో’ మీద భయంకరమైన నెగెటివిటీ కనిపిస్తోంది.
అన్నట్టు, ‘లియో’ సినిమాకి సంబంధించి విజయ్ అభిమానులే కాదు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ అభిమానులు, సంగీత దర్శకుడు అనిరుధ్ అభిమానులూ.. చాలా చాలా యాక్టివ్గా వున్నారు. అదీ విడుదలకు ముందు.
కానీ, సినిమా విడుదలయ్యాక సీన్ మారింది.! ఎవరు ఇంతలా ‘లియో’ సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో విజయ్ అభిమానులకే అర్థం కావడంలేదు.
Also Read: ఫ్యామిలీ స్టార్.! విజయ్ దేవరకొండ ఈసారేం చేస్తాడో.!
డిజాస్టర్ టాక్ వచ్చినాగానీ, తొలి రోజు వసూళ్ళ ప్రభంజనం అయితే వేరే లెవల్లో వుంది. రెండో రోజూ వసూళ్ళు బాగానే వున్నాయ్.!
ప్రతిసారీ ఇదే తంతు.! సినిమా డిజాస్టర్.. వసూళ్ళు మాత్రం ఓకే.. బావున్నాయ్.. చాలా బావున్నాయ్.! విజయ్ సినిమాలకే ఎందుకిలా జరుగుతోందబ్బా.?