Janhvi Kapoor Telugu Cinema.. తెలుగు సినీ పరిశ్రమలోని వ్యక్తులు, చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు.! జాన్వీ కపూర్ ఈ విషయంలో చిన్న వయసులోనే మహా ముదురు.. అన్నట్టు వ్యవహరిస్తోందేమో.!
ప్రస్తుతం ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీయార్ నుంచి రాబోతున్న సినిమా ఇది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘దేవర’ తెరకెక్కుతోంది.. అదీ, పాన్ ఇండియా స్థాయిలో.!
Janhvi Kapoor Telugu Cinema.. సొంతింటికి వచ్చినట్లుగా..
‘దేవర’ షూటింగ్ కోసం గతంలోనే హైద్రాబాద్‌కి వచ్చింది జాన్వీ కపూర్. తొలుత టెస్ట్ షూట్ కోసం, ఆ తర్వాత రెగ్యులర్ షూట్ కోసం.!
కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ హైద్రాబాద్‌లో ల్యాండ్ అయిన జాన్వీ కపూర్, ‘దేవర’ సినిమా కోసం వస్తోంటే, సొంతింటికి వచ్చినట్లుగా వుందంటూ వ్యాఖ్యానించింది.

తెలుగు సినీ పరిశ్రమని సొంతిల్లుగా ఆమె భావించి వుంటే, తెరంగేట్రమే తెలుగు సినీ పరిశ్రమలో జరిగి వుండేది జాన్వీ కపూర్‌కి.
అప్పట్లో.. ఎన్నెన్ని ప్రయత్నాలో..
టాలీవుడ్ నుంచే తన కుమార్తెను తెరంగేట్రం చేయించాలని అతిలోక సుందరి శ్రీదేవి ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
చివరికి, బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్, ఆ తర్వాత తెలుగులో నటించేందుకు చాలా సమయమే తీసుకుంది.
Also Read: అన్నదమ్ములిద్దరూ కలిశారు.! ట్రోల్స్ ఆగుతాయా.?
శ్రీదేవి అకాల మరణం కారణంగానే, జాన్వీ కపూర్ తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేయడం ఆలస్యమయ్యిందన్న వాదనలూ లేకపోలేదు.
కాగా, ‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్ తెలుగులో చేయబోయే సినిమాపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. బాలీవుడ్ నుంచి వచ్చిన చాలామంది భామలు సింగిల్ సినిమాతోనే సర్దేసుకున్నారు.
మరి, జాన్వీ కపూర్ పరిస్థితేంటో.! తెలుగు మాత్రమే కాదు, తమిళ సినిమా నుంచి పిలుపులొస్తున్నా, జాన్వీ కపూర్.. సుముఖత వ్యక్తం చేయడంలేదట.