Little Hearts Big Victory.. ‘లిటిల్ హార్ట్స్’.. చిన్న సినిమా. కాదు కాదు, చాలా చిన్న సినిమా.! కానీ, చాలా చాలా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది.
విడుదలైన తొలి రోజే, ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా బ్రేక్ ఈవెన్ అవడమంటే ఆషామాషీ విషయమా.? కానే కాదు.!
సినిమాలో కంటెంట్ వుంటే చాలు, ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నది ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ.
Little Hearts Big Victory.. సరదా సరదాగా..
సినిమా అంటే ఏంటి.? సినిమా అంటేనే, వినోదం.! ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చేది ఆ వినోదం కోసమే. కావాల్సినంత వినోదం వుంది ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో.
అందుకే, ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకుంది. మౌళి, శివానీ నగరం.. పెద్దగా పేరు లేని నటీనటులే. కానీ, ఇప్పుడు స్టార్లుగా మారిపోయారు.
అటు వైపు పెద్ద సినిమాలు పోటీలో వున్నాయ్.. కానీ, ‘లిటిల్ హార్ట్స్’ వెనుకంజ వేయలేదు. నిజానికి, ఇలాంటి సమయాల్లోనే రిస్క్ తీసుకోవాలి.
పెద్ద సినిమాల్ని తక్కువ చేయలేంగానీ..
పాన్ ఇండియా స్టార్లు.. అనిపించుకున్న హీరోలకే బ్రేక్ ఈవెన్లు జీవిత కాలంలో దొరకని పరిస్థితి.. అనే విమర్శ వుంది. కానీ, ఓ చిన్న సినిమా బ్రేక్ ఈవెన్.. అదీ ఒకే రోజులో సాధించడం గొప్ప విషయమే కదా.
పెద్ద సినిమాల మాటున చిన్న సినిమాలు నలిగిపోతున్నమాట వాస్తవం. అదే సమయంలో, చిన్న సినిమాల దెబ్బకి పెద్ద సినిమాలు గల్లంతయిపోతున్న సందర్భాలూ అనేకం.
అందుకే, సినిమాకి పెద్ద.. చిన్న.. అన్న తేడాల్లేవ్. కంటెంట్ వుంటే, పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే చిన్న సినిమా. అంతే తేడా.. సక్సెస్ పరంగా.!
ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, పెద్ద సినిమాకి హంగామా ఎక్కువ.. ట్రోలింగ్ కూడా ఎక్కువే.
ఔను, పెద్ద సినిమాలకి శతృవులు ఎక్కువ. పెద్ద సినిమాలతో పోల్చి చూసినప్పుడు.. చిన్న సినిమాలకి ‘ట్రోలింగ్, నెగెటివ్ రివ్యూలు’ అనే శతృవులు చాలా తక్కువ.