Little Hearts Maheshbabu.. చిన్న సినిమాలు ఒక్కోసారి పెద్ద సినిమాలకు మించి విజయాలందుకోవడం చూస్తూనే వున్నాం.
అలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద స్టార్లు కూడా దిగొచ్చి ఆయా సినిమాల్ని ప్రశంసించడం గతంలో చాలా సందర్భాల్లో చూశాం.
అలాంటి ఓ చిన్న సినిమాకే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ల నుంచి బోలెడన్ని ప్రశంసలు దక్కుతున్నాయ్. ఆ సినిమానే ‘లిటిల్ హార్ట్స్’. ఈ సినిమాలో నటించిన నటీనటులు పెద్దగా ఎవ్వరికీ తెలీదు.
మేల్ లీడ్ పోషించిన కుర్రాడయితే అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో చేసినట్లన్నాడు.
అలాగే ఓటీటీలోనూ అక్కడక్కడా కనిపించినట్లున్నాడు. వెండితెరపై హీరోగా నటించిందయితే ఇదే తొలి సినిమా.
చాలా చిన్న సినిమా. అయితేనేం.. పెద్ద విజయం అందుకుంది. మెగాస్టార్ మొదలుకుని ఇదిగో సూపర్ స్టార్ మహేష్ బాబు వరకూ ఈ సినిమాని సూపరో సూపర్.. అంటూ తెగ పొగిడేస్తున్నారనుకోండి.
Little Hearts Maheshbabu.. ‘లిటిల్ హార్ట్స్’కి ‘సూపర్’ కామెంట్.!
ఇటీవల ఈ సినిమా సంగీత దర్శకుడు కాబోలు.. ఆయన పేరు సింజిత్..! సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో తనను తాను మహేష్ బాబుకు వీరాభిమానిగా అభివర్ణించుకున్నారు.
అలాగే, ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఇంత ఘన విజయం సాధించినందుకు ఆ ఆనందంలో ఓ వారం రోజులు ఎటైనా వెళ్లిపోతా.. అన్నారు.

అంతేకాదు, ఫోన్ కూడా స్విచ్ ఆప్ చేసి వెళ్లిపోతా.. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తా.. అన్నారాయన.
తాజాగా ఆ కామెంట్స్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్పాండ్ అయ్యారు. లేటెస్ట్‌గా ఆయన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూశారట.
‘ఈ నవ్వుల రైడ్‌కి ఫిదా అయ్యా.. అంటూ చిత్ర యూనిట్‌ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Little Hearts Maheshbabu.. కొత్తా మ్యూజిక్ దర్శకుడండీ.!
సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కడితో ఆగలేదండోయ్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్‌ని వుద్దేశిస్తూ ఓ ఫన్నీ కామెంట్ కూడా షేర్ చేశారు.
‘సింజిత్ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. ఎందుకంటే నువ్వు కొన్ని రోజుల్లో చాలా బిజీ అయిపోతావ్..’ అని పోస్ట్ చేశారాయన.
Also Read: Kaliyugam 2064 Review.. సాగతీత.. సర్వైవల్ థ్రిల్లర్.!
సింజిత్‌ను ఉద్దేశించి మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరలవుతోంది.
సినిమా హిట్‌తో నిజంగానే సింజిత్ పాపులర్ అవుతాడో లేదో.. కానీ, ఇప్పుడు మహేష్ బాబు చేసిన ఈ కామెంట్‌తో మాత్రం పాపులర్ అవడం పక్కా.
టాలీవుడ్‌కి మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడండోయ్.. పిలిచి ఆఫర్లివ్వాల్సిందే..! సూపర్ స్టార్ మహేష్ బాబు అంతటోడే చెప్పాకా.. ఇవ్వకపోతే కుదురుతుందా.!
