Ram Pothineni Sree Leela.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ మాస్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ పోతినేని. అయితే ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు.
ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్’ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక, ఇప్పుడు బోయపాటి శీను డైరెక్షన్‌లో రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం రామ్ మాస్, ఊర మాస్ అవతార్‌లోకి మారిపోయాడు. ఇటీవలే ‘బోయపాటి రాపో’ అంటూ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ గ్లింప్స్‌లో రామ్ లుక్స్ పట్ల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అయితే, ఈ సినిమాతో రామ్ హిట్టు కొట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా వున్నారు.
Ram Pothineni Sree Leela..లక్కీ ఛామ్ శ్రీలీల.!
అందుకు కారణం ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండడమే. టాలీవుడ్‌కి శ్రీలీల లక్కీ ఛామ్‌గా మారిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: పరిణీతి చోప్రా పెళ్ళిగోల.! అప్పడైతే కష్టం, ఇప్పుడేమో ఇష్టం.!
ఎప్పటి నుంచో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న మాస్ రాజా రవితేజకి శ్రీలీల పుణ్యమా అని ‘ధమాకా’ రూపంలో ఓ సూపర్ డూపర్ హిట్ తగిలింది.

దాంతో, టాలీవుడ్ జనం ఫిక్సయిపోయారు. శ్రీలీలకి పట్టం కట్టేస్తున్నారు. వరుస అవకాశాలతో పాటూ, ఆమె లక్కుని ఆకాశానికెత్తేస్తున్నారు.
దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏమో ఈ దసరా శ్రీలీల రూపంలో ఉస్తాద్ రామ్‌కి అసలు సిసలు పండగ కానుందేమో చూడాలి మరి.