Allu Aravind Param Poramboku.. పెద్ద మనిషి.. చిల్లర వేషాలు వేస్తే అస్సలు బాగోదు.! సరదాకి అయినా, తన స్థాయిని తగ్గించుకునే పనులు ఎవరూ చేయకూడదు.!
మరి, మంచి సమయస్ఫూర్తి కలిగిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, తన స్థాయిని తానే తగ్గించేసుకునేలా వ్యవహరిస్తే ఎలా.?
ఓ సినీ వేదికపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, తనను తాను ‘పరమ పోరంబోకు’గా అభివర్ణించుకున్నారు.
నిజానికి, అలాంటి వేదికలపై, యాంకర్లు ఏవో అడుగుతారు, ప్రముఖులు ఏదో చెప్తారు.. ఇదంతా రొటీన్ వ్యవహారం.
కానీ, అల్లు అరవింద్ ఒక్కసారి తన స్థాయిని గురించి గుర్తెరిగి వ్యవహరించకపోతే ఎలా.? హుందాగా సమాధానం చెప్పొచ్చు. చిలిపిగానూ సమాధానం చెప్పొచ్చు.
Allu Aravind Param Poramboku.. తప్పు చేశావ్ అరవిందూ.!
కానీ, ఈ ‘పరమ పోరంబోకు’ స్టేట్మెంట్ ఏంటి.? ఈ రోజుల్లో కుర్రాళ్ళ వ్యవహార శైలి గురించి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమాలో ఓ డైలాగ్ వుంది.
అందులో, మూడు రకాలుగా కుర్రాళ్ళ మనస్తత్వాన్ని దర్శకుడు, రచయిత కలిసి అభివర్ణించారు. ట్రైలర్‌లోనూ ఆ డైలాగ్ వుంది.
అది పట్టుకుని, చిన్నప్పుడు మీరెలా వుండేవారు.? అని యాంకర్ అడిగితే, ‘నేనూ చిలిపి కుర్రాడినే..’ అనేసి వుంటే, అల్లు అరవింద్ చిలిపితనంతోనే సరిపోయేది ఆ వేదిక.
Also Read: PONMAN Telugu Review: వీడెవడండీ బాబూ.!
కానీ, ‘పరమ పోరంబోకు’ ప్రస్తావన ఏంటి.? అల్లు అరవింద్ మాట జారిన మాట వాస్తవం. తర్వాత ఆయనే, ఒకింత నొచ్చుకుని వుండొచ్చుగాక.. తన వ్యవహార శైలి గురించి.
ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో నెటిజనం ఏకి పారేస్తున్నారు.
సినీ పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం వున్న అల్లు అరవింద్ ఇలా తేలిక మాటలు తన మీద తానే ప్రయోగించేసుకుంటే ఎలా.?
అల్లు అరవింద్ అంటే, పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ‘పుష్ప’ ఫ్రాంఛైజీతో స్టార్‌డమ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తండ్రి కదా.!
అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన నటుడి తండ్రి అల్లు అరవింద్ ‘పరమ పోరంబోకు’ అనే మాటని జీర్ణించుకోగలరా.?