Maanasa Choudhary Aaryan.. బోల్డంత ఖర్చు చేసి, సినిమాల్లో పాటలు తెరకెక్కిస్తుంటారు. కానీ, కథాగమనానికి అడ్డం వస్తున్నాయని, పాటల్ని కత్తిరించేస్తున్నారు.!
కొన్ని సినిమాల్లో, ఏకంగా హీరోయిన్ పాత్రనే లేపేస్తుండడమూ చూస్తున్నాం. రెమ్యునరేషన్ అయితే ఇచ్చుకోవాలి కదా.!
సినిమాని రిస్క్‌లో పెట్టలేక, ‘కత్తెర పదును’ చూపించాల్సి వస్తోంది. ‘ఆ బుద్ధి ఏదో ముందే వుంటే.. బోల్డన్ని డబ్బులు మిగులుతాయి కదా..’ అనే కామెంట్లు మామూలే.
Maanasa Choudhary Aaryan.. కత్తెర వేటుకి బలైపోయిన ‘ముద్దు’.!
విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో ‘ఆర్యన్’ సినిమా తెరకెక్కింది. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లు. ఈ చిత్రానికి విష్ణు విశాల్ నిర్మాత కూడా.!
సినిమా కోసం ఓ గాఢమైన ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు హీరో, హీరోయిన్ల మీద. కానీ, సినిమాలో ఆ ముద్దు సీన్ కనిపించదు.
ఎందుకంటే, ముద్దు సీన్‌కి చివరి నిమిషంలో కత్తెరేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత, హీరో విష్ణు విశాల్ వెల్లడించాడు.
అదేంటీ, సినిమా కోసం ముద్దు సీన్‌ని చిత్రీకరించి, ఆ సీన్ లేకుండానే సినిమా రిలీజ్ చేయడమేంటి.? అంటే, విష్ణు విశాల్ చెప్పిన సమాధానం ఆశ్చర్యపరుస్తుంది.
హీరోయిన్ మానస చౌదరి, ఆ ముద్దు సీన్‌ని తొలగించమని విజ్ఞప్తి చేసిందట.
ముద్దు సీన్ గురించి దర్శకుడు తొలుత చెప్పినప్పుడు, మానస చౌదరి అభ్యంతరం వ్యక్తం చేయలేదట. షూట్ చేస్తున్నప్పుడూ ‘వద్దని’ చెప్పలేదట.
చివరి నిమిషంలో.. అంటే, ఎడిటింగ్ పూర్తయిపోతున్న సమయంలో, ‘ముద్దు సన్నివేశం తొలగించండి’ అని కోరిందట హీరోయిన్ మానస చౌదరి.
Also Read: తుంటరోడు మా చిరంజీవి ‘గాడు’.!
హీరోయిన్ మానస చౌదరి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ఆ ముద్దు సన్నివేశాన్ని తొలగించినట్లు విష్ణు విశాల్ ప్రకటించాడు. ఈ విషయంలో విష్ణు విశాల్‌ని అభినందించి తీరాల్సిందే.
అన్నట్టు, ‘బబుల్‌గమ్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది మానస చౌదరి. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటించాడు.
‘బబుల్‌గమ్’ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ‘మోతాదుకు మించి’ వుంటాయ్. వాటిల్లో లిప్ లాక్ సన్నివేశాలూ వున్నాయ్.!
