Pranitha Subhash Second Round.. నటి ప్రణీత గుర్తుంది కదా.? అదేనండీ, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో హీరోయిన్ సమంతకి అక్కగా నటించింది కదా.! ఆ ప్రణీతే.!
ఇంతకీ, విషయం ఏంటట.? రెండో రౌండ్ అట.! ప్యాంట్ సరిపోవడంలేదట.! అయ్యోపాపం.. ఈ రౌండ్ల గోలేంటి.? ప్యాంట్ సరిపోకపోవడమేంటి.?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ప్రణీత సుభాష్ (Pranitha Subhash), తాజాగా కొన్ని ఫొటోల్ని షేర్ చేసింది. వాటికి, ‘రౌండ్ 2.. ప్యాంట్ సరిపోవడంలేదు..’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
Pranitha Subhash Second Round.. ఇదీ సంగతి..
ప్రణీతకి ఆల్రెడీ పెళ్ళయ్యింది.. ఓ కూతురు కూడా వుంది.! ఇంకోసారి ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని చెప్పేందుకే ఈ ‘సెకెండ్ రౌడ్’ పోస్ట్ చేసింది ప్రణీత.
మాతృత్వం ఏ మహిళకైనా చాలా చాలా ప్రత్యేకం. మొదటి సారి అయినా, రెండో సారి అయినా.. అదో అద్భుతం.

అందుకే, ఆ అద్భుతమైన ప్రయాణం గురించి ఇలా అందంగా చెప్పాలనుకుంటుంటారు సెలబ్రిటీలు. ఒకప్పటిలా గర్భం దాల్చితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లేవిప్పుడు.
Also Read: Varsha Bollamma: విడాకులకు కారణమేంటో తెలుసా.?
కాదేదీ పబ్లిసిటీకనర్హం.. అని కూడా అనుకోవచ్చనుకోండి.. అది వేరే సంగతి.! ఎలాగైతేనేం, ప్రణీత రెండో సారి గర్భం దాల్చడంపై ఆమె అభిమానులు ఆమెకి విషెస్ అందిస్తున్నారు.