Made In Korea Review.. ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేడ్ ఇన్ కొరియా’.! నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ వీక్షకలుకు అందుబాటులోకి వచ్చిందీ సినిమా.
ప్రియాంక మోహన్‌ని ట్రోల్ చేసేవాళ్లెంతమంది వున్నారో, ఆమెని అభిమానించేవాళ్ళూ అంతే మంది వున్నారు. తెలుగులో కొన్ని హిట్ సినిమాలూ ప్రియాంక మోహన్ ఖాతాలో వున్నాయ్.
తొలి తెలుగు సినిమా ‘గ్యాంగ్ లీడర్’ దగ్గర్నుంచి, మొన్నీమధ్యనే వచ్చిన ‘ఓజీ’ వరకూ పలు తెలుగు సినిమాల్లో నటించింది ప్రియాంక మోహన్.
ఇంతకీ, ‘మేడ్ ఇన్ కొరియా’ సినిమా కథా కమామిషు ఏంటి.? సినిమా ఎలా వుంది.? ఓటీటీలో అందుబాటులో వున్న ఈ సినిమా కోసం టైమ్ కేటాయించొచ్చా.? టైమ్ వేస్ట్ వ్యవహారమా.?
Made In Korea Review.. కథేంటంటే..
ఓ పల్లెటూరి అమ్మాయి.. చిన్నప్పటినుంచీ కొరియా అంటే మక్కువ ఎక్కువ ఆమెకి. పెరిగి, పెద్దయ్యాక.. స్నేహితుడి సాయంతో కొరియా వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులకు చెప్పకుండా.
కొరియా వెళ్ళేందుకు ఫ్లైట్ అయితే ఎక్కుతుందిగానీ, ఆమెతోపాటు ఆమె స్నేహితుడు వెళ్ళడు. స్నేహితుడి చేతిలో మోసపోయానని తెలుసుకుంటుందామె.
ఎలాగైతేనేం, కొరియాలో ల్యాండ్ అవుతుంది.. అక్కడెవరూ తెలియక ఇబ్బందులు పడుతుంది.. ఎలాగైతేనేం, ఓ పని దొరుకుతుంది.. ఆ తర్వాత ఏమయ్యిందన్నది మిగతా కథ.
ప్రేమతో పెంచిన తల్లిదండ్రుల్ని కాదని, పనీ పాటా లేని ఓ కుర్రాడితో ఇంట్లోంచి పారిపోతుంది హీరోయిన్. తల్లిదండ్రులు ప్రమాదంలో వున్నారని తెలిసి, కొరియాని వదిలేసి.. అప్పటికప్పుడు ఇండియాకి వచ్చేస్తుంది.
సినిమాని దర్శకుడు తనకు ఇష్టమొచ్చినట్లు తిప్పేసుకున్నాడు. లాజిక్కులు అస్సలు వెతక్కుండా చూస్తే, సినిమా జస్ట్ టైమ్ పాస్ అవుతుందంతే.
అలాగని, పూర్తిగా తీసి పారేసే సినిమా కూడా కాదు.! కొరియాలో రెస్టారెంట్ పెట్టి, అక్కడో మ్యూజిక్ బ్యాండ్ తయారు చేసి.. ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే మలిచాడు హీరోయిన్ పాత్రని దర్శకుడు.
గతంలో ఇలాంటి సినిమాలు చాలానే చూశాం.. అనిపించొచ్చుగాక.. అది వేరే సంగతి. నటన పరంగా ప్రియాంక మోహన్ నుంచి పెద్దగా ఆశించేదేమీ లేదు. సోసో.. అంతే.
మిగతా పాత్రధారులూ అంతే. కొరియన్ నటీనటులూ సినిమాలో వున్నారు. అన్నట్టు, హీరోయిన్ కూడా కొరియన్‌తోనే ప్రేమలో పడుతుంది.
క్లయిమాక్స్‌లో హీరోయిన్ మళ్ళీ తన కొరియన్ స్నేహితులతో కలిసి, కొరియా వెళ్ళిపోతుంది. కథ సుఖాంతం.!
డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మ్యూజిక్, సినిమాకి తగ్గట్టుగా వుంది. నిర్మాణపు విలువలు బావున్నాయి. ఎక్కడా ఎలాంటి అసభ్యతకూ తావివ్వలేదు సినిమాలో.
ఓవరాల్‌గా, సినిమాని ఓటీటీలో నిరభ్యంతరంగా చూసెయ్యొచ్చు. టైమ్ పాస్ అయిపోతుందంతే. అక్కడక్కడా సాగతీత అనిపిస్తుంది. తెలిసిన కథే అనిపిస్తుంది.
