హరీష్ భాయ్.. నువ్వు ‘గ్రేట్’.! భలే ఏకిపారేశావోయ్.!
Harish Shankar Greatandhra.. దర్శకుడు హరీష్ శంకర్‌కి కోపమొచ్చేసినాది.! చానా చానా కోపమొచ్చేసినాది.! వస్తది మరి, విషయం అలాంటిది.!
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఈగల్’ సినిమాకి ఒకటిన్నర రేటింగ్ వేశాడో ప్రబుద్ధుడు.! అదే సమయంలో ‘యాత్ర-2’ సినిమాకి అతగాడిచ్చిన రేటింగు మూడు.!
పేరులో ‘రెడ్డి’ వుంది కదా.! ఆ మాత్రం పైత్యం వుంటుంది.. ఆ వెబ్ సైట్ నిర్వాహకుడికి.! పైగా, ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో మేసేస్తున్నాడు.!
Harish Shankar Greatandhra.. రవితేజ ఏం పాపం చేశాడు చెప్మా.?
అద్గదీ అసలు సంగతి.! సరే, రవితేజ ఏం పాపం చేశాడు.? ఎప్పుడన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడా.? పోనీ, సదరు వెబ్ సైట్ మీద సెటైర్లు వేశాడా.? లేదే.!
అసలు విషయమేంటంటే, ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్‌కి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా అభిమానం. అక్కడ తేడా కొట్టింది.
నిర్మాత మీద కసి, సినిమా మీద చూపించాడన్నమాట ఆ వెబ్ సైట్ అధినేత. వెబ్ సైట్ పేరులో ‘గ్రేట్’ అని వుంటుందిగానీ, చేసేవన్నీ నీఛపు వ్యవహారాలేనని బయట టాకు.!
నిర్మాతల్ని బ్లాక్‌మెయిల్ చేయడం.. నటీనటుల మీద జుగుప్సాకరమైన రాతలు రాయడం.. వాట్ నాట్.! కడుపుకి అన్నమే తింటాడో, అశుద్ధమే తింటాడోగానీ.. చెత్తంతా నింపేస్తాడు ఆ వెబ్ సైట్‌లో.!
హరీష్ ఆవేదనలో అర్థం వుంది..
సో, దర్శకుడు హరీష్ శంకర్ ఆవేదనలో అర్థం వుంది.! గట్టిగానే ఏకిపారేశాడు సదరు వెబ్ సైట్‌ని. గతంలో పలు సందర్భాల్లో ఆ వెబ్‌సైట్‌కి టార్గెట్ అయ్యాడు హరీష్ శంకర్.
అది గతం.! ఇప్పుడైతే హరీష్ శంకర్ ఏకిపారేసిన వైనానికి సినీ పరిశ్రమలో చాలామంది నుంచి మద్దతు లభిస్తోంది.! రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తామని నిర్మాత, సదరు వెబ్‌సైట్‌కి వార్నింగ్ కూడా ఇచ్చారు.. అది వేరే వ్యవహారం.!
అంతా బాగానే వుందిగానీ, సినిమా ముందు పుట్టింది.. వెబ్ సైట్లు ఆ తర్వాత పుట్టాయ్.. అని సెలవిచ్చాడు హరీష్ శంకర్.
ఎవరు ఎప్పుడు పుట్టారన్న చర్చ ఇక్కడ అప్రస్తుతం.! హరీష్ ఇలాగే మాట తూలేస్తూ వుంటాడు.! ‘నువ్వెప్పుడు పుట్టావ్.?’ అని ప్రశ్నిస్తే హరీష్ పరిస్థితేంటి.?
Also Read: ముఖ్యమంత్రి, మీమర్స్, పరదాలు ఓ దర్శకుడి యాతన!
ఈ ఒక్క విషయంలో తప్ప, హరీష్ సదరు చెత్త వెబ్ సైట్‌ని ఏకిపారేసిన మిగతా స్పీచ్ అంతా వేరే లెవల్.!
‘నా పేరు పెట్టకుండా, బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు పెట్టి నా మీద గాసిప్స్ రాస్తారా.? మీకంత ధైర్యం లేదా.?’ అని హరీష్ శంకర్ ప్రశ్నించేయడం ఓకే.!
కానీ, హరీష్ శంకర్ ఎందుకు తన స్పీచ్‌లో సదరు వెబ్ సైట్ పేరు ప్రస్తావించలేకపోయాడు.? భయమా.? ఆ వెబ్ సైట్ పేరు ‘గ్రేటాంధ్ర’.! వీలైతే, ఈసారి వేదికపై పేరు చెప్పి మరీ ఏకిపారెయ్ హరీష్ భాయ్.!