Maganti Gopinath Death Mystery.. జూబ్లీహిల్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొన్నాళ్ళ క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయిన సంగతి తెలిసిందే.
మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. రాజకీయాలన్నాక విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రత్యారోపణలు అత్యంత సహజం.
అసలు మాగంటి గోపీనాథ్ ఎలా చనిపోయారు.? అన్న ప్రశ్న, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ చర్చకు దారి తీసింది.
అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ తల్లి, ఆయన మొదటి భార్య.. ‘డెత్ మిస్టరీ’పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాకెక్కడం గమనార్హం.
Maganti Gopinath Death Mystery.. అందరికీ అన్నీ తెలుసా.?
అందరికీ అన్నీ తెలుసు.. అనుకుంటే పొరపాటే.! చాలామంది, చాలా విషయాల్ని పట్టించుకోరు. మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలూ అంతే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచింది మాగంటి గోపీనాథ్ మొదటి సతీమణి కాదు, రెండో సతీమణి. వీరి వివాహమే చెల్లదన్న వాదన తెరపైకొచ్చింది.
ఈ వివాదమేదో వస్తుందనే, ‘ప్లాన్-బి’లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, పి విష్ణువర్ధన్ రెడ్డికి కూడా బి-ఫామ్ ఇచ్చిందనే ప్రచారం అప్పట్లో జరిగింది.
కానీ, మాగంటి సునీత నామినేషన్‌కి లైన్ క్లియర్ అవడంతో, బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో, డెత్ మిస్టరీ అంశం హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: ‘మిరాజ్’ సమీక్ష.! బాబోయ్.. మరీ ఇన్ని ట్విస్టులా.?
స్వర్గీయ ఎన్టీయార్ మరణంపై ఇప్పటికీ అనుమానాలున్నాయి ఆయన అభిమానులకి. అలానే, వైఎస్సార్ మృతిపైనా అనుమానాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే.
కానీ, ఆయా ప్రముఖుల మరణాలు.. ఆయా రాజకీయ అవసరాల నేపథ్యంలో మాత్రమే చర్చనీయాంశమవుతుంటాయి. ఆ తర్వాత కథ మామూలే.!
ఇంతకీ, మాగంటి గోపీనాథ్ డెత్ మిస్టరీ వెనుక అసలు కథేంటి.? ఇది కూడా అంతే.. ఇదీ ఎప్పటికీ వీడని చిక్కు ముడే.! ఉప ఎన్నిక అయిపోయాక, అంతా మర్చిపోతారేమో.!
