ఇది క్లియర్.. డే వన్ నుంచీ అబిజీత్‌కి (Mahanayakudu Abijeet) నాగ్ అక్కినేని నాగార్జున కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నాడు. బహుశా బిగ్ బాస్ 4 సీజన్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌గా అబిజీత్‌ని నాగ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వుండొచ్చేమోనన్న చర్చ జరుగుతోంది. నాగ్ మాత్రమే కాదు, చాలామంది ఇదే అభిప్రాయంతో వున్నారు.
మొదటి నుంచీ అబిజీత్ కూల్ అండ్ కంపోజ్డ్‌గా వుంటున్నాడు. మోనాల్ గజ్జర్‌తో కలుపుతున్న ‘పులిహోర’ సంగతి పక్కన పెడితే, టాస్క్‌లలో మాత్రం అబిజీత్ పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో వ్యవహరిస్తున్నాడు. ఇదే విషయాన్ని మిగతా హౌస్‌మేట్స్ కూడా కుండబద్దలుగొట్టేస్తున్నారు.
కుమార్ సాయి తాజాగా అబిజీత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలే చేశాడు. వాటి పట్ల అబిజీత్ చాలా కూల్‌గానే వ్యవహరించాడు. మరోపక్క అఖిల్ కూడా, అబిజీత్ మీద ఫైర్ అయ్యాడు. అప్పుడు కూడా అబిజీత్ సంయమనంతోనే వ్యవహరించాడు. బిగ్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
వివిధ రకాలైన మనస్తత్వాలున్న వ్యక్తులు ఒకే ఇంట్లో వుండటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ క్రమంలో మనస్పర్ధలు, అభిప్రాయ బేధాలు వచ్చేస్తాయి. వాటన్నిటినీ దాటుకుని, టైటిల్ వైపు వెళ్ళడమే బిగ్‌బాస్ రియాల్టీ షోలో అసలు సిసలు గేమ్.
‘రోబోట్స్ – హ్యామన్స్’ టాస్క్‌లో మైండ్ గేమ్ ఆడి, ‘మహా నాయకుడు’ అన్పించేసుకున్నాడు అబిజీత్. ఓ వైపు కుమార్ సాయి, ఇంకో వైపు అఖిల్.. ఇద్దరూ అబిజీత్‌ని టార్గెట్ చేయడం.. ఈ క్రమంలో నాగ్, ఒక్కసారిగా విషయాన్ని డైల్యూట్ చేసేయడం చాలామంది గమనించారు. లేకపోతే ఇష్యూ చాలా సీరియస్ అయ్యేది. ఎడ్యుకేషన్ సహా చాలా అంశాలు చర్చకు వచ్చాయిక్కడ.
అయితే, అఖిల్ మైండ్‌లో సాయి మాటలు చాలా బలమైన ముద్ర వేసేస్తాయి. వాటి నుంచి అఖిల్ బయటపడటం అంత తేలిక కాదు. మరోపక్క అబిజీత్ (Mahanayakudu Abijeet) కూడా, సాయి పట్ల మరింత ఇబ్బందికరంగానే వుంటాడు. ఒకవేళ సాయి, హౌస్‌లో ఎక్కువ రోజులు కొనసాగితే, ‘ప్రతి వారం నిన్నే నామినేట్ చేస్తా..’ అనే మాటకు కట్టుబడి వుంటాడేమో.!
ఇవన్నీ ఓ ఎత్తు.. ‘ఎ’ అనే లెటర్ పేరుతో మోనాల్‌ని ఆటపట్టిస్తున్న నాగ్.. అబిజీత్ అలాగే అఖిల్‌లను ఇరకాటంలో పడేయడం ఇంకో ఆసక్తికరమైన పరిణామం. అయితే, నాగ్ ఎంతలా గింజుకుంటున్నా.. అక్కడ హౌస్‌లో ఆ కెమిస్ట్రీ సెట్ అవడంలేదు.