తెలుగు తెర పైకి ‘రాజకుమారుడు’ లానే ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు చాలాకాలం క్రితం. అవును సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ (Happy Birthday Mahesh Babu) తెలుగు తెరకు పరిచయమైంది బాల నటుడిగానే. ఆ వయసులో ఆ డాన్సులేంటీ.? నటనలో ఆ మెచ్యూరిటీ ఏంటీ.? అన్నింటికీ మించి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వచ్చింది.?
అందరూ మహేష్‌ని (Sarileru Neekevvaru) చిన్నప్పుడు తెరపై చూసి ఇలాగే ఆశ్చర్యపోయారు. స్క్రీన్‌పై సూపర్ స్టార్ కృష్ణనే డామినేట్ చేసేశాడు. నో డౌట్. నెక్ట్స్ సూపర్ స్టార్ మహేష్ మాత్రమే అని ఎప్పుడో మహేష్ బాలనటుడిగా ఉన్నప్పుడే, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
కొంతకాలం సినిమాల నుండి గ్యాప్ తీసుకుని, ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెండితెరపై అసలు సిసలు రాజకుమారుడు ఇతనేనంటూ మొత్తం సినీ పరిశ్రమ మహేష్‌ని ఆకాశానికెత్తేసింది.
మధ్యలో ఒకటి, రెండు ఫెయిల్యూర్స్ వచ్చినా, నటుడిగా ఏ సినిమాతోనూ నిరాశ పరచలేదు మహేష్. క్రమ క్రమంగా బాక్సాఫీస్ వసూళ్లు అతనికి ఫిదా అయిపోయాయి. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీస్.. ఇలా తేడాలేం లేవ్. అందర్నీ మెప్పించాడు. సినిమా, సినిమాకీ తన ఇమేజ్‌ని పెంచుకుంటూ, వెళ్లాడు.
ఈ క్రమంలో ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా తప్పలేదు. కానీ, సూపర్ స్టార్ అనే ఇమేజ్ మాత్రం అలా అలా కొనసాగుతూనే ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌కి మహేష్ సినిమా అంటే బంగారు కోడి పెట్ట. అవును, ఆ స్థాయిలోనే మహేష్ సినిమాలకి అదిరిపోయే వసూళ్లు వస్తుంటాయక్కడ.
‘ఒక్కడు’, ‘పోకిరి’, దూకుడు’.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒకదాన్ని మించి ఒకటి సంచలన విజయాలు అందుకున్నాయి. ‘శ్రీమంతుడు’ కావచ్చు, ‘భరత్ అనే నేను’ కావచ్చు. ‘మహర్షి’ కావచ్చు. మహేష్ (Happy Birthday Mahesh Babu) ఆలోచనల మార్పుని మనకి చూపిస్తాయి.
కమర్షియల్ హీరోగా తిరుగు లేని స్టార్‌డమ్ అందుకోవడం ఒక్కటే కాదు, తన సినిమాలతో సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనే మహేష్ పట్టుదల ఆయా సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలతో హిట్లు కొడుతున్నాడు. సూపర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు.
ఇంతేనా.? ఇంకా చాలా ఉంది. మహేష్ (Super Star Mahesh Babu) అనగానే వివాద రహితుడు అనాలనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటాడు. రిజర్వ్‌డ్‌గా ఉంటాడనే అభిప్రాయం కొంతమందిలో ఉన్నా, అందర్నీ కలుపుకుపోయే నైజం చాలా సందర్భాల్లో బయటపడింది. వెంకటేష్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయడమే ఇందుకు నిదర్శనం.
తన సినిమా ‘భరత్ అనే నేను’ ప్రమోషన్ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని (Young Tiger NTR) ముఖ్య అతిథిగా తీసుకొచ్చి, అభిమానులకు ఖచ్చితమైన సంకేతాల్ని పంపాడు.
సినిమా ఇండస్ట్రీలో పోటీ స్నేహపూర్వకమైనదేనని చాటి చెప్పాడు. మహేష్ – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ – చరణ్ (Ram Charan), మహేష్ – ప్రబాస్ (Prabhas).. ఇలా ఇండస్ట్రీలో అందరితోనూ మహేష్ సన్నిహితంగా ఉంటాడు.
చిన్న హీరోల సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. యంగ్ టాలెంట్‌ని ప్రమోట్ చేస్తుంటాడు. అందుకే యునానిమస్‌గా మహేష్‌ని సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తుంటారంతా. నెంబర్ గేమ్‌ని నమ్మని ‘సూపర్‌స్టార్..’ మహేష్. నేనే నెంబర్ వన్ అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ప్రతీ శుక్రవారం బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మారిపోవచ్చు. ఈ విషయాన్ని మహేష్ ఎప్పుడో చెప్పాడు.
నెంబర్ గేమ్ చిరంజీవితోనే ఆగిపోయిందని, ఈ కొత్త ట్రెండ్‌లో ప్రతీ సినిమా ఓ సవాల్ అనీ చెప్పాడు. అదే నిజం. మహేష్ హిట్ కొడితే, దాన్ని ఇంకో హీరో అధిగమించాలి. దాన్ని మరో హీరో దాటాలి. మళ్లీ మహేష్ సత్తా చాటాలి. ఇంతటి పోజిటివ్ ఆటిట్యూడ్ మహేష్‌కి ఐదేళ్ల క్రితమో, పదేళ్ల క్రితమో వచ్చింది కాదు.
మొదట్నుంచీ మహేష్‌ది (Happy Birthday Mahesh Babu) ఇదే వైఖరి. హిట్ కొట్టినప్పుడు పొంగిపోడు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోడు. మారిన ట్రెండ్ నేపథ్యంలో నిర్మాతగా సరికొత్త బాధ్యతలు అందుకుని, సినీ నిర్మాణంలో తన వంతు భాగం పంచుకుంటున్నాడు. సినిమా పట్ల అతని బాధ్యత అది.
అన్‌డిస్‌ప్యూటెడ్ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా… మహేష్‌బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. విజయాలు ఆయనకు కొత్త కాదు కనుక, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకోకుండా ఉండలేం. విజయాలతో పాటు, తండ్రిని మించిన తనయుడిగా తెలుగు సినిమా పరిశ్రమకి తన వంతు సేవలు అందించాలని ఆశిద్దాం ఆకాంక్షిద్దాం. మరోసారి హ్యాపీ బర్త్‌డే టు మహేష్‌బాబు.