Maheshbabu Devil.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ పనుల్లో బిజీగా వున్నాడు.! త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా.
సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ తర్వాత, మహేష్‌బాబు చేయబోయే సినిమా, రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
గ్లోబ్‌ట్రోటింగ్ అనే కాన్సెప్ట్‌తో రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు (Super Star Maheshbabu) హీరోగా తెరకెక్కనుంది ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్.
రాజమౌళితో మామూలుగా వుండదు మరి.!
రాజమౌళి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నేళ్ళు ఆ సినిమా తీస్తాడో ఏమో.! ఆ తర్వాత మహేష్‌బాబు చేయబోయే సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనేనా.?
తాజాగా, ఈ విషయమై సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పందిస్తూ, తాను మహేష్‌తో ‘డెవిల్’ (Devil) అనే సినిమా చేయాలనుకున్నానని చెప్పాడు.
‘యానిమల్’ కథనే మహేష్ రిజెక్ట్ చేశాడంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన సందీప్ రెడ్డి వంగా, మహేష్‌కి తాను చెప్పిన కథ ‘డెవిల్’ అనీ, ‘యానిమల్’ కంటే వైల్డ్‌గా సినిమా వుంటుందన్నాడు.
అంతే కాదు, ‘డెవిల్’ కథని మహేష్‌బాబు (Super Star Maheshbabu) రిజెక్ట్ చేయలేదని కూడా సందీప్ రెడ్డి వంగా స్పష్టతనిచ్చాడు.
Maheshbabu Devil.. రక్తపాతం.. మహేష్‌తోనా.?
అంత రక్తపాతం, అంత వైల్డ్ కాన్సెప్ట్ మహేష్‌బాబు మీద వర్కవుట్ అవుతుందా.? అన్న డౌటానుమానాలు అయితే, మహేష్ అభిమానుల్లోనే వ్యక్తమవుతున్నాయి.
Also Read: నాగచైతన్య ‘తండేల్’.! అసలేంటి కథ.?
కాగా, ‘పుష్ప’ సినిమాని మహేష్ వదులుకున్నాడనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. మహేష్ వదులుకున్న ‘పుష్ప’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
కాగా, సందీప్ రెడ్డి వంగాని ‘ఒరిజినల్ డైరెక్టర్’ అంటూ పేర్కొంటున్నాడు మహేష్‌బాబు. వన్ అండ్ ఓన్లీ ఒరిజినల్ డైరెక్టర్.. అని సందీప్ గురించి పదే పదే మహేష్, ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యానించడం గమనార్హం.