Maheshbabu Review On RRR Movie: తెలుగు సినిమా తీరు పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సినిమా దిశగానే అందరూ అడుగులేస్తున్నారు. అందరి ఆలోచనలూ అటువైపుగానే సాగుతున్నాయి.
ఈ క్రమంలో ఓ హీరో ఇంకో హీరో సినిమాని ప్రమోట్ చేసేందుకు ముందుకొస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆ లిస్టులో మహేష్‌బాబు సమ్‌థింగ్ వెరీ స్పెషల్.
తాజాగా మహేష్‌బాబు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఏకంగా రివ్యూ (RRR Movie Review) ఇచ్చేశాడు సోషల్ మీడియా సాక్షిగా. సినిమాలుంటాయ్.. అందులో రాజమౌళి సినిమాలు ప్రత్యేకంగా వుంటాయ్.. అంటూ రివ్యూ మొదలు పెట్టాడు సూపర్ స్టార్.
Maheshbabu Review On RRR Movie వెండితెర అద్భుతమిది.!
‘ఆర్ఆర్ఆర్ సినిమాని ఎపిక్’గా అభివర్ణించిన మహేష్ (Super Star Maheshbabu), ‘స్కేల్, గ్రాండ్యూర్, విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్.. అంచనాలకు మించి..’ అంటూ పేర్కొన్నాడు.
‘మిమ్మల్ని మీరు మైమర్చిపోయేలా కొన్ని సన్నవేశాలున్నాయి. అత్యద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని పొందుతారు.. ఓ మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇలా చేయగలడు.. రాజమౌళి ఫిలిం మేకింగ్ ఓ సంచలనం.. ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను..’ అంటూ ట్వీట్ రివ్యూలో ప్రస్తావించాడు మహేష్.
గ్రావిటీ చట్టం కనుమరుగైపోయింది.!
తమ స్టార్‌డమ్‌ని ఎన్టీయార్ (Young Tiger NTR), రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మరింత పెంచుకున్నారనీ, అత్యద్భుతమైన నటనా ప్రతిభను చాటుకున్నారనీ, ప్రత్యేకించి ‘నాటు నాటు’ పాటలో గ్రావిటీనే పని చేయలేదనీ సూపర్ స్టార్ మహేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read: రామ రామ.! అపార్ధం చేసుకున్నాం కదమ్మా.!
మహేష్‌బాబు (Super Star Maheshbabu) తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న విషయం విదితమే.
ప్రతి సినిమాతోనూ అంతకు మించి.. అనే స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోన్న రాజమౌలి (SS Rajamouli), మహేష్ సినిమాతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) రికార్డుల్ని కొల్లగొట్టాలని ఆశిద్దాం.