Baby The Movie Review: తెగేదాకా లాగితే.! తెగిపోయింది ‘బేబీ’.!

Baby Vaishnavi Chaitanya Anand Deverakonda
Baby The Movie Review.. ‘బేబీ’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమానే.. కానీ, పెద్ద సినిమా తరహాలో పబ్లిసిటీ చేశారు.
కొన్ని సినిమాలు అంతే.! పబ్లిసిటీ చేశారని.. ప్రీ రిలీజ్ బజ్ వచ్చేయదు.. అనూహ్యంగా బజ్ పెరిగిపోతుంటుంది. ‘బేబీ’ సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్.
అందుకే, ఆ ఉత్సాహంతోనే.. 14వ తేదీన సినిమా రిలీజ్ అయితే, 13వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ గట్టిగా వేసేశారు.
మొన్నటికి మొన్న నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’కి కూడా ఇలాగే చేశారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసికొట్టింది.
‘రంగబలి’ సినిమా తొలుత హిట్టు టాకు వచ్చినా, చివరికి యావరేజ్.. ఫ్లాప్.. చివరికి డిజాస్టర్ అయి కూర్చుంది. ఇది పెయిడ్ ప్రీమియర్స్ ఎఫెక్ట్.. అనుకోవచ్చా.?
Baby The Movie Review.. కథా కమామిషు ఇదీ..
ఇంతకీ, ‘బేబీ’ సినిమా సంగతేంటి.? సినిమా కథా కమామిషు ఏంటి.? యూ ట్యూబ్ సంచలనం వైష్ణవి చైతన్య, హీరోయిన్‌గా మారి చేసిన తొలి సినిమా ఇది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ‘బేబీ’. వీటన్నిటికీ మించి ‘కలర్ ఫొటో’ సినిమాతో జాతీయ పురస్కరాన్ని అందుకున్న సాయి రాజేష్ నుంచి వచ్చిన సినిమా ‘బేబీ’.
ముక్కోణపు ప్రేమకథ.. ఇందులో ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్. పదో తరగతి ప్రేమ.. ఆ తర్వాత మారిన మనసు.. చివరికి ఏమయ్యింది.? ఇదే ఈ ‘బేబీ’ కథ.
స్కూల్లో చదువుకునే రోజుల్లో.. ఎదురింటి అబ్బాయితో ప్రేమలో పడుతుంది హీరోయిన్. కానీ, పదో తరగతి ఫెయిలవుతాడు హీరో.
హీరోయిన్ కాలేజీకి వెళ్ళాక.. అక్కడ మరో కుర్రాడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ పాయింట్.? మూడు పాత్రల మధ్య సంఘర్షణ కూడా కొత్తేమీ కాదు.
తొలి సినిమాతోనే.. బరువైన పాత్ర..
నిజానికి, హీరోయిన్‌గా తొలి సినిమాతోనే బరువైన పాత్ర దొరికింది వైష్ణవి చైతన్యకి. ఛాలెంజింగ్‌గానే తీసుకుందామె ఈ పాత్రని.

డీ-గ్లామర్ లుక్, గ్లామరస్ లుక్.. రెండిట్లోనూ బాగా చేసింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించింది. తెలుగు తెరకు మరో అందాల భామ దొరికినట్లేననే భావనా కలుగుతుంది.
ఇక, హీరో ఆనంద్ దేవరకొండ విషయానికొస్తే, నటనలో కాస్త బెటరయ్యాడు. విరాజ్ కూడా ఓకే. దర్శకత్వం పరంగా చూస్తే అక్కడక్కడా కొన్ని స్పార్క్స్ కనిపిస్తాయి.
సాగతీతే కొంప ముంచింది..
డైలాగ్స్ ఈ తరం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా వున్నాయి.. ఆలోచనలో పడేస్తాయ్ కూడా. సినిమాటోగ్రపీ, మ్యూజిక్ బావున్నాయ్. ఎడిటింగ్ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుండాల్సింది.
నిడివి ప్రధాన సమస్య ఈ సినిమాకి. సాగతీత.. అంటే, అది వేరే లెవల్.! సాధారణంగా ఇలాంటి సినిమాలకి స్క్రీన్‌ప్లే వేగంగా వుండాలి. తక్కువ సమయంలో సినిమా పూర్తయితే ఎఫెక్టివ్‌గా వుంటుంది.
Also Read: Bro The Avatar.. ఇదే చాలా పెద్ద మార్పు ‘బ్రో
పెయిడ్ ప్రీమియర్స్‌తో హిట్ టాక్ స్ప్రెడ్ చేసేశారు. ఓ పెద్ద సినిమా రిజల్ట్ కోసం రాత్రంతా సోషల్ మీడియాలో అభిమానులు చేసే హంగామా తరహాలోనే.. హడావిడి నడిచిందిగానీ.. తెల్లారేసరికి తేలిపోయింది.
చాలా బావుంది.. అనే టాక్ నుంచి.. బాగానే వుంది.. యావరేజ్.. ప్లాప్.. చివరికి డిజాస్టర్ అన్న టాక్ ఉదయానికి బయటకు వచ్చింది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు సాగతీత.. ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది.
టార్గెట్ ఆడియన్స్‌కి సినిమా కనెక్ట్ అవుతుందా.? ‘సాగతీత’ నుంచి కాస్త విముక్తి (అంటే, విడుదలయ్యాక.. కత్తిరింపులు) కలిగిస్తే.. ఏమో, కనెక్ట్ అవ్వొచ్చేమో.!
– yeSBee
