Maheshbabu Sreeleela Dance.. అదేంటీ, సూపర్ స్టార్ మహేష్‌బాబు అంత మాట అనేశాడు.! ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘తాట ఊడిపోద్ది’ అనే మాటకి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.
అసలు విషయమేంటంటే, ‘హీరోలందరికీ తాట ఊడిపోద్ది’ అనే మాటని మహేష్‌బాబు వాడింది, శ్రీలీల డాన్స్ గురించి మాట్లాడే సందర్భంలో.
ఈ అమ్మాయితో డాన్స్ వేయడం వామ్మో.. అదేం డాన్స్.. అని మహేష్ మాట్లాడుతోంటే, అంతా ఘొల్లున నవ్వేశారు. శ్రీలీల సంగతి సరే సరి.!
Maheshbabu Sreeleela Dance.. అందరిదీ అదే మాట.!
నో డౌట్.. శ్రీలీల చాలా చాలా మంచి డాన్సర్.! శ్రీలీలతో (Sreeleela) డాన్స్ విషయమై రవితేజ, నితిన్.. ఇలా పలువురు తమ అభిప్రాయాల్ని ఇప్పటికే కుండబద్దలుగొట్టేశారు.
తాజాగా, ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Maheshbabu) కూడా చేరిపోయాడు. ‘కుర్చీ మడతబెట్టి..’ అంటూ సాగే సాంగ్‌లో మహేష్, శ్రీలీల చెలరేగిపోయిన సంగతి తెలిసిందే.
మామూలుగా అయితే మహేష్‌బాబు డాన్సులేయడంలో ఒకింత పొదుపు చేస్తుంటాడు ఎనర్జీని.! కానీ, ఈ మధ్య తన సినిమాల్లో డాన్సులూ బీభత్సంగానే చేసేస్తున్నాడు.
Also Read: సందీప్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.!
శ్రీలీలతో డాన్స్ కదా, ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో ఇంకాస్త ఎనర్జిటిక్ స్టెప్పులు వేసేశాడు మహేష్.!
మొత్తమ్మీద, శ్రీలీలకి ఇది నిజంగానే సూపర్ కాంప్లిమెంట్ అని చెప్పక తప్పదు. ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకి తమన్ సంగీతం అందించాడు.
అన్నట్టు, ఈ ‘గుంటూరు కారం’లో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటించింది.