నారా రోహిత్ పెళ్ళికి ఈ ‘గ్రామ సింహాల’ హడావిడేంటి.?

 నారా రోహిత్ పెళ్ళికి ఈ ‘గ్రామ సింహాల’ హడావిడేంటి.?

Nara Rohit

Nara Rohit Marriage.. సినీ నటుడు నారా రోహిత్ పెళ్ళంట.! అమ్మాయి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ సినీ నటి.. అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయ్.

ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందట.! సినీ నటుడు కదా, ఆయన సన్నిహితులైన సినీ ప్రముఖుల నుంచి విషయం బయటకు వచ్చి వుండొచ్చు.

ఇలాంటి విషయాలు చాలామందికి ముందే తెలుస్తాయ్.. కొంతమంది లైట్ తీసుకుంటారు. కొందరు వాటిల్ని తొలుత గాలి వార్తలుగా మార్చుతారు.!

Nara Rohit Marriage.. గాలి పోగెయ్యడమే పాత్రికేయ వ్యభిచారమ్.!

విషయం నిజమే అయితే, కొన్ని రోజుల తర్వాత అధికారిక ప్రకటన వస్తుంది.! లేదంటే, గాలి వార్తగానే మిగిలిపోతుంటుంది.

ఇక, ఎర్నలిజం అనేదొకటి ఇటీవలి కాలంలో బాగా పెచ్చుమీరిపోతోంది కదా.! గాలి పోగెయ్యడం, బ్లాక్‌మెయిల్ చెయ్యడం.. వెరసి, ఇదంతా ఓ టైపు పాత్రికేయ వ్యభిచారం.

ఇలాంటోళ్ళకి ఏదో ఒక వార్త వుండాలి.! వార్త లేకపోతే పుట్టిస్తుంటారు. నారా రోహిత్ పెళ్ళి వ్యవహారం ఎలాంటిదోగానీ, ‘నేనే ముందు బ్రేక్ చేశా’ అంటూ చంకలు గుద్దుకుంటున్నాడో సినీ ఎర్నలిస్టు.

ఎవరైనా, దీన్ని ఎక్స్‌క్లూజివ్.. అని చెప్పుకుంటారేమోనని సదరు ఎర్నలిస్టు భయం.! ఆ భయాన్ని మళ్ళీ ఆ సినీ ఎర్నలిస్టే బయటపెట్టుకోవడం ఇంకాస్త ఆశ్చర్యకరం.

అందుకే, మీడియా అసలెక్కడుంది.. అంతా మాఫియానే.. అనేది.! అదీ నిజమే మరి.! పాత్రికేయం, విలువలు.. ఇవేమీ లేవ్.!

ఒక్కమాటలో చెప్పాలంటే, నారా రోహిత్ పెళ్ళికి, ఈ గ్రామ సింహం హడావిడేంటి.? అంతే కదా మరి.! నవ్విపోదురుగాక.. ఆ సినీ ఎర్నలిస్టుకేటి సిగ్గు.?

Digiqole Ad

Related post