Malaika Arora వయసు మీద పడినా, వన్నెతరగని అందం ఆమె సొంతం. లేటు వయసులో తనకంటే, చాలా చిన్న వాడైన ఓ యంగ్ హీరోతో సహజీవనం చేస్తోందామె. సమాజం ఏమనుకుంటుంది.? అనేది ఆమెకి అనవసరం. తనకు నచ్చిన జీవితాన్ని తాను, తనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తానని చెబుతుంటుంది. అదే ఆమె ప్రత్యేకత.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ అంటూ స్పెషల్ సాంగ్‌లో హాట్ హాట్ అందాలతో కాక పుట్టించిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. బాలీవుడ్‌లో బోలెడంత పాపులారిటీ ఉందీ హాట్ బ్యూటీకి. ఎప్పటికప్పుడే సోషల్ మీడియాలో హాట్ హాట్ యోగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తుంటుంది.
Malaika Arora.. అందం.. అద్భుతం..
సినిమా తెరపై అందాలారబోస్తూ నటిగా గుర్తింపు పొందడమే కాదు, తెర వెనుక నిర్మాతగానూ సత్తా చాటుతోంది. అంతేకాకుండా, పలు వాణిజ్య సంస్థల్లో పెట్టుబడులు పెట్టి, సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగింది. అటు కుటుంబాన్ని చూసుకుంటూనే ఇటు సినిమాల్లోనూ, బిజినెస్‌లోనూ రాణిస్తోంది మలైకా అరోరా.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరున్నిపెళ్లాడింది. కానీ, అభిప్రాయ బేధాల వల్ల విడాకులు తీసుకుంది. అయినా పర్సనల్ లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తోందీ ముద్దుగుమ్మ. ఇక ఐటెం సాంగ్స్ విషయంలో ఎప్పుడూ మొహమాటపడదు. వయసుతో సంబంధం లేకుండా అందాలారబోతకు సై సై అంటుంది. ‘దిల్ సే’ సినిమాలోని మలైకా నటించిన ‘ఛయ్యా ఛయ్యా’ సాంగ్ అప్పటికీ ఇప్పటికీ ఓ సంచలనమే.
మోడలింగ్ నుంచి.. వ్యాపారం దాకా..
కాగా, అమ్మడు మోడలింగ్ క్వీన్ కూడా అందుకే ఎప్పుడూ ఫిట్‌గా వుంటుంది. తను మాత్రమే ఫిట్‌గా ఉంటే సరిపోదంటుంది. అందుకే ఫిట్‌నెస్ పాఠాలు చెప్పడానికి ఏకంగా రెండు స్టూడియోలు రన్ చేస్తోంది.. సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ కూడా. ఆ సోషల్ మీడియా వేదికగానే అటు గ్లామర్‌నీ, ఇటు తన వ్యాపారాల్నీ ప్రమోట్ చేస్తూ వస్తోందీ బ్యూటీ.
అలాగే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఇలా ఒక్కటేమిటి.. గ్లామర్ తారగా వెలిగిపోతూనే, మరోపక్క బిజినెస్ రంగంలోనూ తనదైన స్టైల్‌లో సత్తా చాటుతూ, సక్సెస్‌ఫుల్ విమెన్ అనిపించుకుంటోంది మలైకా అరోరా. ‘సర్వ’, ‘దివ’ పేరుతో మలైకా నిర్వహిస్తోన్న రెండు యోగా స్టూడియోలూ సూపర్బ్‌గా కాసుల పంట పండించేస్తున్నాయట. లేబుల్ లైఫ్ పేరుతో మలైకాకి ఓ ఫ్యాషన్ బ్రాండ్ వుంది. అమ్మాయిలకే ప్రత్యేకమిది.
Also Read: విద్యాబాలన్‌తో Ileana D Cruz.. ఇది ‘ఏ’ టైపు.?
కొన్నాళ్ళ క్రితమే భర్తకు విడాకులిచ్చేసిన మలైకా అరోరా (Malaika Arora) ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది.. ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గత కొన్నాళ్లుగా పలు మీడియా చాన్నాళ్ళు ప్రచారంతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.