Malaika Arora.. ఏం.! ఆమెకంటే అందగత్తెలు లేరా.? లేకనేం, చాలామందే వున్నారు.! వయసేమో యాభైలలోకి వెళుతోంది.! అయినాగానీ, ఆమెకి ఫిదా అవుతున్నారు నెటిజనం.!
పరిచయం అక్కర్లేని పేరది.! ఔను, మలైకా అరోరా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్ సతీమణి మలైకా అరోరా.. కానీ, అది ఒకప్పుడు.!
అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది మలైకా.!
Malaika Arora ఎందుకింత పాపులారిటీ.?
2022లో ఎక్కువమంది ఇంటర్నెట్‌లో వెతికిన అందాల భామల లిస్టు చూస్తే, అందులో మలైకా అరోరా పేరు కూడా కనిపిస్తుంది.
దీపికా పడుకొనే, కత్రినా కైఫ్.. ఇలాంటి స్టార్ హీరోయిన్లు.. సౌత్ నుంచి ఎదిగి నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక లాంటి టెండర్ బ్యూటీస్.. పూజా హెగ్దే లాంటి అందాల భామలు.. వీళ్ళతోపాటే మలైకా అరోరా కూడా.!
మలైకా అంటే ఎందుకంత క్రేజ్.? అంటే, నిత్యం మీడియాలో వుండేందుకు తనవంతుగా కష్టపడుతుంటుంది మలైకా. అదే ఆమె సక్సెస్ సీక్రెట్.
జిమ్ దగ్గర్నుంచి.. ఫ్యాషన్ షోస్ వరకూ..
నిత్యం జిమ్‌కి వెళుతుంటుంది మలైకా అరోరా.. అక్కడ బాలీవుడ్ మీడియా ఆమె కోసం పడిగాపులు కాస్తుంటుంది. ఫ్యాషన్ షోస్ విషయంలో ఆమె ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇవే కాదు, చాలా వున్నాయ్. అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్న, ‘బాహులిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్నంతగా ఎప్పటికప్పడు ట్రెండింగ్ అవుతుంటుంది.
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ఫర్ మలైకా అరోరా. టీనేజ్‌కి వచ్చిన కొడుకున్నా.. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో సహజీవనం.! మలైకా రూటే సెపరేటు.!
Also Read: Kalpika Ganesh: ఆమెకి పెళ్ళయితే ఈమెకి ఎందుకీ మంట.?
మూవింగ్ విత్ మలైకా.. అని ఓ టాక్ షో నిర్వహిస్తున్నా.. సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నా.. యోగా పేరుతో వర్కవుట్ పాఠాలు నేర్పిస్తున్నా.. మలైకా అరోరా ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్.!
అర్జున్ కపూర్‌కి ప్రేమ పాఠాలు నేర్పడంలో అయినాసరే.!