పవన్ కళ్యాణ్, నితిన్.. ఓ మల్టీస్టారర్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), రానా దగ్గుబాటితో (Rana Daggubati) కలిసి మల్టీస్టారర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యపనుం కోషియం’ సినిమా రీమేక్‌లో పవన్, రానా కలిసి నటిస్తున్నారు. మరో మల్టీస్టారర్ దిశగా పవన్ కళ్యాన్ అడుగులేస్తున్నారా.? అంటే, అవునేమో.. (Pawan Kalyan Nithin Multi Starrer) అన్న సమాధానం వస్తోంది.
నిజానికి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచన ఎవరికి కలిగిందో తెలుసా.? ఇంకెవరికి.. పవన్ కళ్యాణ్‌ని తన ఆరాధ్య దైవంగా భావించే హీరో నితిన్‌కే. ఔను, నితిన్ ఎలాగైనా పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ సినిమాలో నటించాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నితిన్ వెల్లడించాడు.
నితిన్ గట్టిగా కోరుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ‘నో’ అనే అవకాశమే లేదు. ఎందుకంటే, పవన్ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఏడాదికి ఓ సినిమా చేయడమంటే చాలా కష్టం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nithin Multi Starrer) విషయంలో. కానీ, ఇప్పడలా కాదు.. పవన్ కళ్యాణ్ ఎడా పెడా సినిమాలు చేసేస్తున్నారు.
‘వకీల్ సాబ్’ (Vakeel Saab) పూర్తయ్యింది.. ఇంకో రెండు సినిమాలు లైన్లో వున్నాయి.. సెట్స్ మీదకు వచ్చేసి. ఇవి కాక మరో రెండు సినిమాలు ఖరారైపోయి.. షూటింగ్ ప్రారంభానికి సిద్ధంగా వున్నాయి. నితిన్ గనుక గట్టిగా ఫోకస్ పెడితే, అతి త్వరలో నితిన్ – పవన్ కాంబోలో మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్ళిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఆ దిశగా నితిన్ ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేసేసి వుండొచ్చు కూడా. ఎందుకంటే, నితిన్ నోట పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ అనే మాట ఏదో సరదాగా వచ్చేసిందని అనుకోలేం మరి. సో, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో (Pawan Kalyan Nithin Multi Starrer) ప్రకటన కోసం ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు నితిన్ అభిమానులూ ఎదురు చూసెయ్యొచ్చన్నమాట.