Malavika Mohnan Animal Park.. దృష్టి పడింది.. కంట్లో పడ్డావ్.. ఇలాంటి మాటలు హీరోయిన్ల విషయంలో ఎక్కువగా వినిపిస్తుంటాయి. అదో టైపు సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్ అంతే.!
అసలు విషయానికొస్తే, ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), ఇటీవల ఓ ఫంక్షన్‌లో మాళవిక మోహనన్‌ని కలిశాడట.
మాళవిక మోహనన్ (Malavika Mohanan)ని చూడగానే, ‘లాక్’ అయిపోయాడట.! అదీ తన తదుపరి సినిమా కోసమట.! ఏంటీ నిజమేనా.?
ప్రస్తుతానికి గాసిప్పేగానీ..
‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా, ప్రబాస్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ‘స్పిరిట్’ అనే పేరు అనుకుంటున్నారు. ఇంకోపక్క, అల్లు అర్జున్ కూడా లాక్ చేశాడు ఓ ప్రాజెక్టుని సందీప్ రెడ్డి వంగాతో.
ఇక, మహేష్ (Super Star Maheshbabu) – సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చే అవకాశమూ లేకపోలేదు.
ఇదిలా వుంటే, ‘యానిమల్’ సినిమాకి కొనసాగింపుగా, ‘యానిమల్ పార్క్’ (Animal Park) అనే ఓ సినిమా తీయాలని సందీప్ రెడ్డి వంగా అనుకుంటున్నాడట.
ఆ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), రణ్‌బీర్ కపూర్ సరసన మాళవిక మోహనన్‌ని అనుకుంటున్నాడట.!
అట వ్యవహారం బాగానే వుందిగానీ.. ఇది నిజమేనా.? ప్చ్.. ఏమో.. గుర్రం ఎగరావచ్చు.!