Malavika Mohanan మాళవిక మోహనన్ తెలుసు కదా.? విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే సినిమా చేయాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ.
అసలు విషయమేంటంటే, ‘అందం’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది మాళవిక మోహనన్ తాజాగా.
Malavika Mohanan అమ్మకి నేను అలా కనిపిస్తేనే ఇష్టం..
‘అందం అనేది వేసుకునే మేకప్పులో వుండదు.. ధరించే దుస్తుల్లోనూ వుండదు..’ అంటూ మాళవిక మోహనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘నేను మేకప్ లేకుండానే అందంగా వుంటానని మా అమ్మ చెబుతుంది. అందుకే, మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాను.. తప్పనిసరైతే తప్ప మేకప్ జోలికి వెళ్ళను..’ అని చెప్పింది మాళవిక.
Also Read: Mrunal Thakur Selfiee: ఈ యాంగిల్ కూడా వుందా.?
సహజమైన అందానికి తాత్కాలిక మెరుగులు అనేవి మాళవికకి అస్సలు నచ్చవట. కానీ, గ్లామర్ ప్రపంచం గనుక.. మెరుగులు దిద్దక తప్పడంలేదంటూ వాపోయిందీ భామ.
మేకప్ పెద్దగా అవసరం లేని, నేచురల్ లుక్ సినిమాలు చేయడం తనకిష్టమనీ, అయితే అది అంత తేలికైన విషయం కాదని మాళవిక చెబుతోంది.