Table of Contents
Ananthika Sanilkumar Tollywood..హీరోల కంటే, సినిమా ప్రమోషన్లకు హీరోయిన్లు ఎక్కువగా ఉపయోగపడితే.. అంతకన్నా కావాల్సిందేముంది.?
ఓ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్లే, సినిమా ప్రమోషన్లను భుజానికెత్తుకుంటే, అభినందించి తీరాల్సిందే.
అలానే, హీరోలతో సమానంగా పోటీ పడి మరీ, సినిమా ప్రమోషన్ల కోసం హీరోయిన్లు ఆసక్తి చూపిస్తే, ఏ నిర్మాత అయినా ఆనందించకుండా వుంటాడా.?
Ananthika Sanilkumar Tollywood.. అనంతిక సమ్‌థింగ్ స్పెషల్..
ఇక్కడ మనం చర్చించుకుంటున్నది హీరోయిన్ అనంతిక గురించే. ‘8 వసంతాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ మల్టీ ట్యాలెంటెడ్ భామ.

కరాటేలో బ్లాక్ బెల్ట్.. క్లాసికల్ డాన్సర్.. ఇన్ని క్వాలిటీస్ వున్నాక, నటనలో ‘మేటి’ కాకుండా వుంటుందా.? అందుకేనేమో, అనంతిక గురించి, చాలా గట్టిగా చెబుతున్నాడు దర్శకుడు.
వేదికపై, అనంతిక టాలెంట్ చూశాక, ‘దర్శకుడు కొంచెం తక్కువే చెప్పాడేమో’ అనిపించకమానదు.. అతనెంత ఎక్కువగా చెప్పినాసరే.
వేదికపై అదరగొట్టేసిందంతే..
అనంతిక, ‘8 వసంతాలు’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా, వేదికపై క్లాసికల్ డాన్స్ చేసింది.. అదీ, చీరకట్టులోనే. అంతే కాదు, కరాటే విన్యాసాల్ని కూడా వేదికపైనే చేసింది.. అవి కూడా చీరకట్టులోనే.

అలా ఎలా చేసేసింది.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.. ఈ ఈవెంట్‌కి హాజరైనవారు. వీడియోల్ని సోషల్ మీడియాలో చూస్తున్నవారి ఆశ్చర్యానికి అవధులే లేవు.!
హీరోయిన్లు సినిమా ప్రమోషన్లకు సరిగ్గా రారనే విమర్శ ఎప్పటినుంచో వుంది. కానీ, కొందరు హీరోయిన్లు, హీరోల కంటే ఎక్కువగా, ఉత్సాహంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
రీల్స్ నుంచి.. యాక్షన్ ఫీట్స్ వరకూ..
అందాల భామలు రీల్స్ చేయడం మామూలే. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లతో కలిసి డాన్సులు చేయడం, ఆ రీల్స్ వైరల్ అవడం చూస్తూనే వున్నాం.
Also Read: పద్మ భూషణ్.! తెలియక వచ్చిన పురస్కారమా బాలయ్యా.?
కానీ, ముందే చెప్పుకున్నట్లు అనంతిక సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్. ఈ తరం అమ్మాయిలకి, అనంతిక ఓ స్ఫూర్తి.. అని చెప్పక తప్పదు.
నటిగా ‘8 వసంతాలు’ సినిమా అనంతికకి మంచి విజయాన్నివ్వాలని కోరుకుందాం.