Malavika Mohanan.. నటి మాళవిక మోహనన్ చాలా కూల్ అండ్ డీసెంట్.! ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళదు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే వుంటుంది. అందుకేనేమో, ఆమెకు అభిమానగణం చాలా చాలా ఎక్కువే.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోల్నీ, తనకు సంబంధించిన విశేషాల్నీ షేర్ చేస్తూ వుంటుంది మాళవిక మోహనన్. అయితే, తాజాగా మాళవిక మోహనన్ తన పాత ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఘాటైన కామెంట్లు చేసింది.
Malavika Mohanan.. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా.?
మాళవిక మోహనన్ ఇంతలా ఆగ్రహానికి గురికావడం వెనుక బలమైన కారణమే వుంది. ఫేక్ ఫొటోని ఒరిజినల్ ఫొటోగా చూపిస్తూ, మాళవిక మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మాళవిక దృష్టికి తీసుకెళ్ళారు ఆమె అభిమానులు. అద్గదీ అసలు సంగతి.

అసలు ఫొటో ఇది.. ఫేక్ పొటోలతో దుష్ప్రచారం చేయడం మానెయ్యండంటూ క్లాస్ తీసుకుంది సోకాల్డ్ హేటర్స్‌కి మాళవిక మోహనన్.
అండగా నిలిచిన అభిమానులు..
చిన్న చిన్న విషయాల్ని లైట్ తీసుకోవాలనీ, వాటి గురించి పట్టించుకోవద్దనీ మాళవిక అభిమానులు తమ అభిమాన నటికి సూచించారు. ఆ ఫేక్ వ్యవహారాల గురించి తాము చూసుకుంటామంటూ ఆమెకు భరోసా ఇస్తున్నారు.

సహజంగానే కొందరు దురభిమానులు ఆమెని ఇంకా ఫేక్ ఫొటోలతో ట్రోల్ చేస్తూనే వున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు.
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
ఇంతకీ ఎవరు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నట్టు.? ఏమోగానీ, మాళవిక పేరు మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతోందంటే.. దానిక్కారణం.. ఆ ఫేక్ ఫొటోనే.!