Table of Contents
Malavika Mohanan Tollywood Timing.. అన్నీ బాగుంటే, టాలీవుడ్‌లో ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే సినిమాలో నటించాల్సి వుంది.
ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లాకా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో, తమిళంలో పాప అడుగు పెట్టింది. పెడుతూ పెడుతూనే స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది.
తొలి సినిమాకే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘పేట్ట’లో నటించేసింది. ఆ తర్వాత ‘మాస్టర్’, ‘మారన్’.. అంటూ తమిళ స్టార్ హీరోలైన విజయ్, ధనుష్ తదితర హీరోల సరసన నటించి మెప్పించింది.
డబ్బింగ్ సినిమాలతోనే..
చేసినవి తమిళ సినిమాలే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్నీ దోచేసింది. ముఖ్యంగా కుర్రకారుకు మాళవిక మోహనన్ ఓ సెన్సేషన్ అయిపోయింది.
అందుకు కారణం సోషల్ మీడియానే అనడం అతిశయోక్తి అనిపించదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే మాళవిక మోహనన్, తద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అలాగే క్రేజీ ఆఫర్లు కూడా పట్టేయడం, హాట్ పోజుల్లో నెట్టింటిని గ్లామర్ షేక్ చేయడం.. ఇలా అమ్మడు యూత్‌లో ట్రెండింగ్ అయిపోయింది.
Malavika Mohanan Tollywood Timing.. బ్యూటీ ఆఫ్ డిగ్నిటీ..
సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నప్పటికీ ఎంచుకునే పాత్రలో వేరియేషన్, ఇంపార్టెన్స్ వుండేలా చూసుకోవడం మాళవిక మోహనన్ ప్రత్యేకత.

హుందా అయిన పాత్రలతో పాటూ, గ్లామర్ కూడా పండించగల సత్తా వుంది. కానీ, నటిగా గుర్తింపు తెచ్చుకునే పాత్రలను ఎంచుకుంటూ పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో కెరీర్ బిల్డప్ చేసుకుంటోందీ మలయాళ ముద్దుగుమ్మ.
త్వరలో టాలీవుడ్‌లో ప్రబాస్ సరసన నటించబోతోంది. అదే మారుతి డైరెక్షన్‌లో రూపొందబోయే సినిమా. ప్రస్తుతం తమిళ అగ్రహీరోలో ఒకరైన విక్రమ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
పాత్ర కోసం పూర్తిగా మారిపోయిన మాళవిక
విక్రమ్ హీరోగా ‘తంగలాన్’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక పాత్ర చాలా కొత్తగా వుండబోతోంది.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ రకంగా సాహసోపేతమైన పాత్రనే చెప్పాలి మాళవిక ఈ సినిమాలో పోషించే పాత్రని. ఈ పాత్ర కోసం పూర్తిగా డీ గ్లామర్ లుక్స్‌లోకి మారిపోయింది మాళవిక మోహనన్.
Also Read: అక్కినేని నాగచైతన్య ‘దూత’ నిజంగా నిజమైపోతేనో.?
ఆ సంగతి అటుంచితే, సోషల్ మీడియాని మాత్రం హీటెక్కించేస్తోంది తన తాజా అందాలతో మాళవిక మోహనన్. రెడ్ అవుట్ ఫిట్‌లో ఓర చూపులతో కుర్రకారుకు గాలమేస్తోంది.
కైపెక్కించే కళ్లతో నెటిజన్స్‌ని గ్లామర్ మ్యాజిక్‌లో ఉయ్యాలలూగించేస్తోంది. అందుకేనేమో నెట్టింట ఈ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయ్.